ఇదేం ఆగంరా నాయనా..? ఆకాశం నుంచి పురుగుల వర్షం..!

-

ఆకాశం నుండి వడగల్లు పడటం మీరు చూసి ఉంటారు. కొన్నిసార్లు చేపలు కూడా పడిన ఘటనలు ఉన్నాయి.. కానీ ఇప్పుడు పురుగులు పడుతున్నాయి తెలుసా.? చైనాకు ఏమైందో పాపం.. అటు జనాభా తగ్గిపోతుంది.. ఇటు వైరస్‌లు ఒక దాని తర్వాత ఒకటి వస్తున్నాయి.. ఇప్పుడు ఈ పురుగుల వర్షం కూడా అక్కడే. పురుగులతో అక్కడి రోడ్లన్నీ నిండిపోయాయి.. కారు పార్క్ చేస్తే పురుగులు కమ్మేశాయి. దరిద్రాలు అన్నీ అక్కడే ఉన్నాయా అన్నట్లు ఉన్నాయి..

 పురుగుల వర్షం
పురుగుల వర్షం

బీజింగ్ రోడ్డుపై నిలిచిన కార్లపై ఆకాశం నుంచి వర్షంతో పాటు పెద్ద సంఖ్యలో పురుగులు పడినట్లు న్యూయార్క్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఇలా పడటానికి కొన్ని కారణాలు ఉన్నట్లు చెప్తున్నారు.. భారీ గాలులకు బురదలోని పురుగులు పైకి కొట్టుకెళ్లి వర్షంతో పాటు ఇలా పడి ఉంటాయని సైంటిఫిక్ జర్నల్ మదర్ నేచర్ నెట్వర్క్ తెలిపినట్లు చెప్పింది. తుపాను తర్వాత వీచే భారీ గాలుల్లో పురుగులు, కీటకాలు చిక్కుకున్నప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయని జర్నల్ చెబుతోంది.

చైనాలో పురుగుల వర్షానికి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ను ట్విట్టర్‌లో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. పురుగులు మీద పడకుండా ఉండేలా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. పురుగులు తమపై పడకుండా ఉండేందుకు కొందరు వ్యక్తులు గొడుగులు వినియోగిస్తూన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇక పురుగుల వాన పడుతుండటంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఇంట్లో ఉండే హాహా కారాలు చేస్తున్నారట. బయటకెళ్లాలంటేనే జంకుతున్నారట. అయితే ఇదంతా అమెరికా వెర్షన్ న్యూస్‌. చైనా దీన్ని ఫేక్‌ అని కొట్టిపడేస్తుంది.

పురుగుల వర్షం వీడియోలు ఓవైపు సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతుండగా.. మరోవైపు చైనా ఈ వీడియోలను ఫేక్‌ అని కొట్టిపారేసింది. చైనా జర్నలిస్ట్ షేన్ షివే ఈ న్యూస్‌ను ఖండించారు. పురుగుల వర్షం వీడియో ఫేక్ అని తెలిపారు. బీజింగ్ నగరంలో ఇటీవలి కాలంలో ఎలాంటి వర్షాలు కురవలేదని చెప్పారు. అసలు వర్షమే పడనప్పుడు.. ఇక తుపాను, పురుగుల వర్షం ఎక్కడ నుంచి పడుతుందో తనకైతే అర్థం కావడంలేదన్నారు. దీంతో ఈ వీడియో అసలైనదా కాదా అని నెటిజ‌న్లు అయోమ‌యంలో ప‌డ్డారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news