వైరల్ వీడియో…! కారు ఆపడానికి ఈ ట్రాఫిక్ పోలీసు ఎంత పని చేసాడో చూడండి…!

-

ఢిల్లీలోని సెక్యూరిటీ చెక్ వద్ద ట్రాఫిక్ పోలీసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని పట్టుకోవటానికి, ఒక అధికారి తన కారు బోనెట్ పైకి దూకాడు, కాని నిందితుడు దాదాపు రెండు కిలోమీటర్ల దూరం అలాగే వెళ్ళాడు. గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. అధికారులకు ఈ వీడియో ధర్యాప్తుకి సహకరించింది.

ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం… పోలీసులు నాంగ్లోయి చౌక్ వద్ద వాహనాల పేపర్లను తనిఖీ చేస్తుండగా, ఒక వ్యక్తి కారు మరొక వైపు నుండి వచ్చింది. పోలీసులు ఆ వ్యక్తిని ఆపమని కోరినప్పటికీ కొంచెం వేగాన్ని తగ్గించిన తరువాత కారును వేగం పెంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అతన్ని ఆపడానికి, ఒక ట్రాఫిక్ పోలీసు అధికారి సునీల్ తీవ్రంగానే కష్టపడ్డారు. అతని కారు బోనెట్ పైకి దూకాడు.

ఈ సంఘటన గత ఏడాది నవంబర్‌లో జరిగింది, అయితే దీని వీడియో ఇటీవలే వైరల్ అయ్యింది. వాహనాన్ని ఆపడానికి బదులుగా, నిందితుడు వేగాన్ని పెంచాడు. పోలీసును రెండు కిలోమీటర్ల దూరం అలాగే లాక్కెళ్ళాడు. కారులోని సహ ప్రయాణీకుడు తన మొబైల్ ఫోన్‌లో ఈ సంఘటనను రికార్డ్ చేశాడు, దీనిలో పోలీసు వాహనం యొక్క హుడ్‌లో వేలాడటం కనపడుతుంది. పలువురి విజ్ఞప్తి మేరకు ఆ వ్యక్తి వేగాన్ని తగ్గించి, కారును దిగడానికి పోలీసును అనుమతించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో పోలీసుకు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news