సెల్ఫీల ద్వారా ఇప్పటి వరకు చాలా మరణాలు సంభవించాయి. అయినప్పటికీ డేంజరస్ పొజిషన్ లో సెల్ఫీ తీసుకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు కోకొల్లలు. తాజాగా సెల్ఫీ మోజు ఓ యువతి ప్రాణాలు తీసింది. ఈ ఘటన యూఎస్ లోని పనామాలో చోటు చేసుకున్నది.
ఓ యువతి బిల్డింగ్ 27వ అంతస్తు బాల్కనీ దగ్గరికి వచ్చింది. బిల్డింగ్ రెయిలింగ్ మీద కూర్చొని సెల్ఫీ తీసుకోబోయింది. అంతే.. ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయి 27వ అంతస్తు నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనను వేరే బిల్డింగ్ నుంచి ఓ వ్యక్తి తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.