విమానం మూవ్ అవుతుండగా… కికీ చాలెంజ్ లో పాల్గొన్న మహిళా పైలెట్..!

-

కికీ చాలెంజ్.. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన చాలెంజ్. పాపులర్ సింగర్ డ్రేక్ పాడిన కికీ పాటకు డ్యాన్స్ వేయడమే ఈ చాలెంజ్ స్పెషల్. అయితే.. ఏదైనా వాహనం నడుపుతూనే దిగి డ్యాన్స్ చేసి మళ్లీ అదే వాహనంలోకి ఎక్కాలి. ఇది అసలు కిక్కు. ఈ చాలెంజ్ ను చాలా మంది అనుకరించారు. కొంతమంది కార్ల నుంచి కిందికి దిగబోయి కింద పడి దెబ్బలు కూడా తాకించుకున్నారు. సెలబ్రిటీలు కూడా ఈ చాలెంజ్ లో పాల్గొన్నారు. మొత్తానికి ఈ చాలెంజ్ కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొన్నది.

ఇవన్నీ ఇప్పుడు పక్కన బెడితే.. ఓ మహిళా పైలెట్ విమానాన్ని స్టార్ట్ చేసి విమానం మూవ్ అవుతుండగా విమానం నుంచి కిందికి దిగి కికీ చాలెంజ్ లో పాల్గొనడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఓ పైలెట్ అయి ఉండి.. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news