ఇదేం పాడుపని.. యువకుడిపై ఐదుగురు యువకుల లైంగిక దాడి

682

సూళ్లూరుపేట బస్టాండ్‌లో ఉన్న ఓ యువకుడికి మాయమాటలు చెప్పిన ఐదుగురు వ్యక్తులు అతడిని కిడ్నాప్ చేసి ఆటోలో మన్నర్ పొలురు శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న తైలం చెట్ల లోపలికి తీసుకెళ్లి అతడిపై ముందుగా దాడి చేసి కర్రలతో కొట్టారు.

ఏపీలోని నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడిపై ఐదుగురు యువకులు దాడి చేశారు. దాడి చేయడంతో పాటు అతడిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అతడిపై లైంగిక వేధింపులకు పాల్పడి.. ఆ దృశ్యాలను తమ ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ ఘటన జిల్లాలోని సూళ్లూరుపేటలో పరిధిలో చోటు చేసుకున్నది.

సూళ్లూరుపేట బస్టాండ్‌లో ఉన్న ఓ యువకుడికి మాయమాటలు చెప్పిన ఐదుగురు వ్యక్తులు అతడిని కిడ్నాప్ చేసి ఆటోలో మన్నర్ పొలురు శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న తైలం చెట్ల లోపలికి తీసుకెళ్లి అతడిపై ముందుగా దాడి చేసి కర్రలతో కొట్టారు. అనంతరం అతడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అతడిపై లైంగిక దాడికి పాల్పడిన దృశ్యాలను తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ విషయం బయటికి చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. కానీ.. ఆ వ్యక్తి తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు తెలిపాడు. దీంతో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.