ఈనెల 25 నుంచి అక్టోబర్ 3 వరకు బతుకమ్మ సంబురాలు

-

తెలంగాణ సంబురం బతుకమ్మ పండుగ సమీపిస్తోంది. మరో ఐదు రోజుల నుంచి రాష్ట్రంలో బతుకమ్మ ఉత్సవం షురూ కానుంది. ఈ నేపథ్యంలో బతుకమ్మ ఉత్సవాల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులు చర్చించారు. ఈ పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు.

ఈనెల 25 నుంచి బతుకమ్మ ఉత్సవాలు మొదలవుతాయని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. సద్దుల బతుకమ్మ అక్టోబర్ 3న ఉంటుందని.. దీనికోసం ట్యాంక్ బండ్ వద్ద విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బతుకమ్మ ఘాట్, ట్యాంక్ బండ్, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని సూచించారు. మహిళలు ఉత్సవాల్లో భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.

ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించాలని, బతుకమ్మలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. బతుకమ్మ పండగపై ఆకర్షణీయమైన డిజైన్‌లతో మెట్రో పిల్లర్లను అలంకరించాలని చెప్పారు. ఎల్బీ స్టేడియం, నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మ లోగోలను ఏర్పాటు చేయాలని, నిర్వహణ ఏర్పాట్లు కూడా ఘనంగా ఉండాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news