బతుకమ్మ..ఈ పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగు ప్రజలతో పాటు యావత్ ప్రపంచానికి ఈ పండుగ గురించి తెలుసు..తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు..ఈ పండుగను పూలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు. తొమ్మిది రోజులు,తొమ్మిది రూపాల్లో బతుకమ్మని తయారుచేసి ఆడి, పాడి సంబరంగా వేడుకలను చేసుకుంటారు..చివరిరోజు అమ్మవారిని నిమర్జనం చేస్తారు..ఇక విషయానికొస్తే.. ఈ పండగకు కొన్ని ప్రత్యేక ప్రసాదాలను తయారు చేస్తారు..వాటిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చుద్దాము..
ముద్దపప్పు బతుకమ్మ ప్రసాదం
కావాల్సినవి పదార్థాలు..
కందిపప్పు– ఒక కప్పు
జీలకర్ర – కొద్దిగా
కరివేపాకు రెమ్మలు – ఐదు
పసుపు – టీ స్పూన్
నూనె – కొద్దిగా
నీళ్లు– సరిపడా
తయారీ విధానం..
కందిపప్పును కొంచెంసేపు నానబెట్టాలి. జీలకర్రను కచ్చాపచ్చాగ దంచి కందిపప్పులో వేయాలి. తర్వాత కొంచెం నూనె, కరివేపాకు వేసి, నీళ్లుపోసి కుక్కర్‌లో మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. చివర్లో పప్పును మెత్తగా చేస్తే ముద్దపప్పు బతుకమ్మకు పెట్టే నైవేద్యం రెడీ అయినట్లే..
నాన బియ్యం బతుకమ్మ ప్రసాదం
కావాల్సినవి పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు
పాలు – మూడు కప్పులు
నీళ్లు – ఒక కప్పు
బెల్లం – ఒక కప్పు
నెయ్యి– కొద్దిగా
డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా
తయారీ విధానం..
బియ్యం కడిగి కొంచెంసేపు నానబెట్టాలి. తర్వాత ఒక గిన్నెలో బియ్యం, పాలు, నీళ్లు పోసి ఉడికించాలి. ఇంకో గిన్నెలో బెల్లం వేసి, కొన్ని నీళ్లు పోసి కరిగించి చల్లార్చాలి. ఆ తర్వాత ఉడికిన బియ్యంలో ఈ బెల్లం పాకాన్ని పోసి కలపాలి. కడాయిలో నెయ్యి కరిగించి డ్రై ఫ్రూట్స్ వేగించాలి. వీటితో గార్నిష్ చేస్తే నానబియ్యం ప్రసాదం రెడీ.
అట్ల బతుకమ్మ ప్రసాదం
కావాల్సినవి పదార్థాలు..
బియ్యప్పిండి – ఒక కప్పు
రవ్వ – అర కప్పు
జీలకర్ర – కొద్దిగా
పెరుగు– పావు కప్పు
తయారీ విధానం..
ఒక గిన్నెలో బియ్యప్పిండి, రవ్వ, జీలకర్ర, పెరుగు వేయాలి. నీళ్లు పోస్తూ దోసెపిండి కంటే కొంచెం పలుచగా కలిపి పది నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత దోసెపెనం వేడిచేసి కొంచెం నూనె పూసి పిండిని దోసెలా పోయాలి. నూనె వేసి రెండువైపులా కాలిస్తే అట్ల బతుకమ్మ ప్రసాదం రెడీ..
ఈ ప్రసాదాలతో పాటు మరికొన్ని ప్రసాదాలు కూడా ఉన్నాయి..తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ప్రసాదాలను తయారు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నారు..