రాజకీయాల్లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ నిర్ణయాలు తీసుకునే నాయకుడు జగన్..ఎప్పుడు ఎలాంటి పరిస్తితుల్లోనైనా డేరింగ్ గా రాజకీయం చేస్తారు. అదే ఆయనకు అతి పెద్ద ప్లస్ పాయింట్. ఇలా డేరింగ్ పాలిటిక్స్ చేసే జగన్..నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలవడం కోసం..అదే తరహాలో ముందుకెళ్లనున్నారు. పార్టీ గెలుపు కోసం సొంత పార్టీ నేతలకు చెక్ పెట్టడానికి కూడా జగన్ వెనుకాడరు.
ఇప్పటికే సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సరిగ్గా పనిచేయకపోతే సీటు ఇవ్వలేనని తేల్చి చెప్పేశారు. తనకు పార్టీ గెలుపు ముఖ్యమని దాని కోసం ఎలాంటి నిర్ణయమైన తీసుకుంటానని, ఎలాంటి వారికైనా సీటు ఇవ్వనని చెప్పేశారు. అంటే సరిగ్గా పనిచేయకపోతే ఎంతవరినైనా పక్కన పెట్టేస్తానని జగన్ చెప్పారు. ఇప్పుడు అదే దిశగా జగన్ పనిచేస్తున్నారు. ఇప్పటికే ఇటీవల వచ్చిన పార్టీ అంతర్గత సర్వేల్లో దాదాపు 50 మంది పైనే ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారని, వీరికి మళ్ళీ సీటు ఇస్తే ఓడిపోవడం గ్యారెంటీ అని తేలినట్లు తెలిసింది.
దీంతో వీరికి సీట్లు ఇవ్వకూడదని జగన్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మరో కొన్ని నెలలు చూసి అప్పటికి వారి పనితీరు మెరుగు పడకపోతే నిస్సందేహంగా పక్కన పెట్టేయాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో పనితీరు బాగోని ఎమ్మెల్యేలు ఉన్నచోట అదనపు సమన్వయకర్తలని పెట్టాలని చూస్తున్నారు. కాకపోతే ఈ రూల్‌ని అన్నీ స్థానాలకు వర్తింపజేయాలని జగన్ చూస్తున్నారని కథనాలు వస్తున్నాయి.
అంటే అన్నిచోట్ల ఎమ్మెల్యేలతో పాటు ఇంచార్జ్‌లు, అలాగే అదనపు సమన్వయకర్తలు ఉంటారని తెలుస్తోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..ఇప్పటినుంచి అందరూ కష్టపడాలి. కానీ చివరికి ఎవరు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారో..అలాగే ఎవరికి ప్రజా మద్ధతు ఉందో వారికే సీటు ఇవ్వనున్నారు. అంటే ఎమ్మెల్యే, ఇంచార్జ్, అబ్జర్వర్..ఇలా ముగ్గురులో ఎవరు ఫస్ట్ ఉంటే వారికి సీటు అనే కాన్సెప్ట్ జగన్ పెట్టుకున్నారని తెలుస్తోంది. మరి చూడాలి ఈ ఫార్ములా పూర్తిగా అమలు చేస్తారో లేదో..అలాగే ఎంతమంది సిట్టింగులకు హ్యాండ్ ఇస్తారో.