శివరాత్రి నాడు ఏ పూలతో పూజిస్తే ఏ కొర్కెలు తీరుతాయో తెలుసా ?

గృహస్థ ధర్మంలో దేవుడి ఆరాధనలో కోరికలు అంటే అదేనండి ధర్మబద్ధమైన కోరికలు అడిగితే తప్పుకాదు. శివుడి పూజలో ఏ పూలతో అర్చిస్తే ఏం ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం…

ధనం – గన్నేరుపూలతో
మోక్షం- ఉమ్మెత్తపూలతో
సుఖశాంతుల కోసం- నల్లకాలువతో
చక్రవర్తిత్వం కోసం- తెల్లతామరలతో
రాజ్యప్రాప్తి కోసం-ఎర్రతామరలతో,
నాగకేసరం, కేసరీపుష్పాలతో అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
గన్నేరు, అశోకం, ఊడుగు, తెల్లజిల్లేడులతో పూజించిన వారికి మంత్రసిద్ధి, రోజాపుష్పాలతో లాభాసిద్ధి, దంతి ప్రత్తి పూలతో సౌభాగ్యం కలుగుతుంది. కోరుకున్న కన్యను పొందాలంటే శివుని సన్నజాజి పూలతో పూజించాలి. సంతానం కావాలనుకునేవారు శివుని మొల్లపువ్వులతో పూజించాలి. దర్భపూలతో ఆరోగ్యం, రేలపూలతో ధనం, తుమ్మిపూలతో వశీకరణం, కడిమిపూలతో శత్రుజయం కలుగుతుంది. బిల్వదళ పూజ దారిద్ర్యాన్ని తొలగిస్తుంది. శివుని మరువంతో పూజిస్తే సుఖం, లోద్దుగపూలతో పూజిస్తే గోసంపద కలుగుతుంది. మోదుగ, బూరుగు పూలతో పూజిస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది.

– కేశవ