పుల్కాల్లోకి ఇలా ముల్లంగి ఫ్రే చేయండి.. ఆయిల్‌ లేకున్నా టేస్ట్‌ అదుర్స్..!

-

ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిది.. అయితే దీంతో చాలామంది సాంబర్‌ , చట్నీలు మాత్రమే చేసుకుంటారు కానీ.. ఇంకా వెరైటీ ట్రే చేయరు. ఇతర దుంపల కంటే.. ముల్లంగి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో వాటర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. షుగర్‌ ఉన్నవాళ్లు, బరువు తగ్గాలనుకునే వాళ్లు ఇది డైలీ వారి డైట్‌లో భాగం చేసుకుంటే మంచి రిజల్ట్‌ ఉంటుంది. ఈరోజు మనం ముల్లంగి ఫ్రైని ఆయిల్‌ లేకుండా ఎలా చేయాలో చూద్దామా..!

ముల్లంగి ఫ్రై చేయడానికి కావాల్సిన పదార్థాలు..

ముల్లంగి ముక్కలు ఒక కప్పు
ఉల్లిపాయ ముక్కలు అరకప్పు
కొబ్బరి తురుము అరకప్పు
పచ్చిమిర్చి నాలుగు
మినపప్పు ఒక టేబుల్‌ స్పూన్
శనగపప్పు ఒక టేబుల్‌ స్పూన్
అల్లం తురుము ఒక టేబుల్‌ స్పూన్
జీలకర్ర ఒక టీ స్పూన్
ఆవాలు ఒక టీ స్పూన్
మిరియాలు చెక్కా ముక్క ఒక టీ స్పూన్
లెమన్‌ జ్యూస్‌ ఒక టేబుల్‌ స్పూన్
మీగడ ఒక టీ స్పూన్
పసుపు కొద్దిగా
కరివేపాకు కొద్దిగా
కొత్తిమీర కొద్దిగా

తయారు చేసే విధానం..

ముందుగా ముల్లంగిని తీసుకుని చిన్నగా కట్‌ చేసుకుని ఆవిరి మీద పది నిమిషాలు ఉడకనివ్వండి. ఎక్కువ ఉడకనివ్వొద్దు. 40- 50 శాతం ఉడికితే చాలు.
పొయ్యిమీద ఒక నాన్‌ స్టిక్‌ పాత్ర పెట్టి అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మినపప్పు, మిరియాలు, మీగడ, కరివేపాకు, పచ్చిమిరికాయ ముక్కలు, అల్లం తురుము, ఉల్లిపాయ ముక్కలు ఇలా ఒక దాని తర్వాత ఒకటి వేస్తూ కాస్త మగ్గిన తర్వాత మనం ఉడికించుకున్న ముల్లంగి ముక్కలు కూడా వేయండి. 5-6 నిమిషాలు తాలింపులో కదిపి.. కొబ్బరి తురుము, కొత్తిమీర, నిమ్మరసం వేసి తీసేయడమే.. సాధారణంగా.. దుంపల ఫ్రై ఎక్కువగా తినకూడదు అంటారు. కానీ ఇలా ముల్లంగి ఫ్రై చేసుకుంటే.. అరకేజీ అయినా తినేయొచ్చు. పుల్కాలు, చపాతీల్లోకి చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి.. ఓసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రే చేయండి.
– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news