ద్రాక్ష పండ్లు తిన‌డం వ‌ల్ల ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా..?

-

ఆరోగ్యానికి తాజా పండ్లు ఎంతో మంచివన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో ద్రాక్షని ఆహారంలో తీసుకోవడ వల్ల కలిగే లాభాలు ఎన్నో. అందని ద్రాక్ష పుల్లన అని అంటారు కాని ఆ ద్రాక్షను అందిపుచ్చు కుంటే అనేక పోషకాలను పొందవచ్చని నూట్రిషియన్లు కూడా చెప్పుతున్నారు. అంత్యంత పోషక విలువలు కలిగిన ద్రాక్ష ఆరోగ్యానికి అందించడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నిర్మూలిచండంలో ద్రాక్ష పండ్లు ప్రధాన పాత్రను పోషిస్తుందనడంలో ఎటువంటి సందేహంలేదు. ద్రాక్షలో విటమిన్‌ సి, కె, కాల్షియం ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మైగ్రేన్‌ని తగ్గిస్తుంది. పీచుపదార్థం ఉండడం వల్ల చెడు కొలస్ట్రాల్‌ను నియంత్రించి గుండెకు బలాన్ని చేకూర్చి, గుండెదడ నుండి కాపాడుతుంది.

ఎసిడిటిని దూరం చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. షుగర్‌ వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. అధిక బరువుతో బాధపడుతున్న వారు తమ శరీర బరువును తగ్గించుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కాగా ద్రాక్ష పండ్ల రసం తాగితే బరువు తగ్గి నాజుగ్గా తయారు అయ్యే అవకాశం ఉంది. ఈ పండ్ల రసంలో మిగిలిన పండ్ల కంటే తక్కువ క్యాలరీలు ఉంటాయి. శిరోజాల పోషణతోపాటు నిగారింపునిస్తాయి. చర్మసంరక్షణకు ఉపయోగపడుతుంది. వీటి గింజలను గుజ్జు చేసి తలకు పట్టించడం వల్ల వెంట్రుకలు నిగనిగలాడతాయి. వయస్సు వల్ల చర్మం మీద వచ్చే ముడతలను తగ్గిస్తుంది. ఇందులో పొటాషీయం ఉండడం వల్ల మూత్రపిండాల్లోని రాళ్లను సైతం కరిగిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news