రోగనిరోధక శక్తిని పెంచడానికి “జింక్” ఎలా పనిచేస్తుందో తెలుపుతున్న నిపుణులు..

శరీరంలో రోగనిరోధకశక్తి లేకపోతే చిన్న సూక్ష్మక్రిముల వలన కూడా హాని కలుగుతుంది. రోగనిరోధక శక్తి కారణంగా శరీరానికి హాని కలిగించే సూక్ష్మక్రిములని ప్రతిరక్షకాలు చంపివేస్తాయి. దానివల్ల శరీరానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఐతే ఈ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి సరైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. కోవిడ్ టైమ్ లో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి అన్న విషయమై సోషల్ మీడియాలో విపరీతమైన వార్తలు వస్తున్నాయి. విటమిన్ సి కలిగిన ఆహారాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయం చేస్తాయని అంటున్నారు. ఐతే విటమిన్ సి ఒక్కటే కాదు జింక్ కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుందని తెలుసుకోండి.

భారతీయులలో జింక్ లోపం ఎక్కువగా ఉందని విశ్లేషకుల అభిప్రాయం. రోగనిరోధకశక్తి పెంచే జింక్ శరీరంలో తయారవదు. ఆహారాల ద్వారా దీన్ని శరీరానికి అందించాలి. జీవక్రియ పనితీరులో, కణాల నిర్మాణంలో జింక్ కీలక పాత్ర వహిస్తుంది. శరీరంలోని 300ఎంజైముల కంటే జింక్ ఎక్కువ మేలు చేస్తుంది. జింక్ లోపం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ఒత్తిడి, పనిచేయాలనిపించక పోవడం మొదలగునవి ఈ కారణంగా కనిపించే లక్షణాలు. మరి ఇంత మంచి జింక్ ని శరీరానికి ఎలా అందించాలి? వేటిల్లో జింక్ ఎక్కువగా ఉంటుందన్న విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

జింక్ శరీరానికి అందించడానికి మాంసం తినడం సరైనది. కూరగాయల్లో జింక్ శాతం చాలా తక్కువ. మాంసంతో పోల్చితే కూరగాయల్లో దీని పాళ్ళు చాలా తక్కువ. ఫౌల్టీలో జింక్ అధికంగా ఉంటుంది. అందువల్ల శాఖాహారులు జింక్ ఉన్న ఆహారాని తీసుకోవాలంటే, బీన్స్, బాదం మొదలగు విత్తనాలని నానబెట్టడం ద్వారా శాఖాహారులు జింక్ ని పొందవచ్చు. జీడిపప్పు, పొద్దుతిరుగుడు పువ్వు, గుమ్మడికాయ విత్తనాలు, పుచ్చకాయ విత్తనాలు మొదలగు వాటిల్లో జింక్ లభిస్తుంది. జింక్ ఉన్న పండ్ల విషయానికి వస్తే, దానిమ్మ, అవొకొడో, బ్రోకలీ, పుట్టగొడుగులు ఉన్నాయి.