కోవిడ్ 19: మీ పిల్లల మెదడు అభివృద్ధి కోసం తీసుకునే ఆహారాలు..

-

కోవిడ్ 19 ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందన్న సంగతి తెలిసిందే. కానీ మీకిది తెలుసా? కోవిడ్ 19 మీ మెదడుని కూడా ప్రభావితం చేస్తుంది. పిల్లల్లో ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది.
అందుకే సరైన ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. మీ పిల్లల మెదడును అభివృద్ది పరిచే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సరైన ఆహారం వల్ల మీ జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. శారీరకంగానే కాదు మానసికంగానూ ఆహారం ప్రభావం ఉంటుంది. మీ పిల్లల ఆరోగ్యానికి కావాల్సిన ఆహారాలు

గుడ్లు

గుడ్లలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్ కారణంగా రోజంతా హుషారుగా ఉంటారు. ఇందులో ఉండే కోలీన్ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అందుకే రోజుకో గుడ్డు తినాలని చెబుతుంటారు. వాళ్ళు చెప్పినట్టుగా కాకుండా వారంలో మూడు సార్లయినా గుడ్లని మీ ఆహారంలో భాగం చేసుకోండి.

ఓట్స్

ఓట్మీల్ లో ఉండే ఫైబర్ ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది. అదీగాక జంక్ ఫుడ్ తినకుండా నిరోధిస్తుంది. విటమిన్ ఈ, జింక్, బీ కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల పిల్లల మెదడు పనితీరు బాగుంటుంది.

రంగు రంగుల కూరగాయలు

కూరగాయల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరానికి చాలా మేలు చేస్తాయి. టమాట, చిలగడ దుంపలు, క్యారెట్లు, పాలకూర వంటివి ఆహారంలో చేర్చండి. ఇవి పిల్లల మెదడును అభివృద్ధి పర్చడంలో ఎంతో సహకరిస్తాయి.

పాల ఉత్పత్తులు

పాలలో శక్తివనరులు చాలా ఉంటాయి. అంతేకాదు పాల ఉత్పత్తులైన పెరుగు, జున్ను, నెయ్యిలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఒక్కో రకం పాల ఉత్పత్తులు ఒక్కో విధమైన ఆరోగ్యాన్ని అందిస్తాయి. అందుకే రోజువారి దినచర్యలో పాలని ఒక భాగం చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news