డయాబెటిస్ ఉన్న వారికి టమాట రసం చేసే మేలు గురించి తెలుసుకోండి..

-

టమాట.. మన వంటింట్లో నిత్యం కనబడే కూరగాయ. దీన్ని కూరగాయగా, పండుగా చెప్పుకోవచ్చు. టమాట తినడం వల్ల చాలా లాభాలున్నాయి. చాలా తేలికగా చేసుకునే టమాట రసం సేవించడం వల్ల ఎంతో ఆరోగ్యం మన సొంతం అవుతుంది. టమాట రసంలో విటమిన్ బీ విటమిన్ బి 1, బి 2, బి 3, బి 5, బి 6, కె, పొటాషియం, ఐరన్ మరియు ఇతరులు తగినంత మొత్తంలో ఉంటారు. అంతే కాదు ఇందులో విటమిన్ సి శాతం అధికంగా ఉంటుంది. అందుకే రోజు వారి ఆహారంలో భాగంగా టమాట రసాన్ని తీసుకోవాలని సూచిస్తుంటారు.

బరువు తగ్గడం, రక్తపీడనాన్ని తగ్గించడం, వంటి ప్రయోజనాలని టమాట రసం అందిస్తుది. రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించి ఇబ్బందులని దూరం చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు టమాట రసాన్ని తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల నుమ్డి బయట పడవచ్చని పరిశోధనలో తేలిందని అధ్యయనాలు చెబుతున్నాయి.

టమాట వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు

టమాటలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచడంతో పాటు ప్రేగు కదలికలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇందులో ఉండే విటమిన్ సి, బీటా కెరాటిన్, విటమిన్ ఈ వల్ల కొవ్వు అదుపులో ఉంటుంది. తద్వారా బరువు పెరగకుండా ఉంటుంది.

టమాట రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

టమాట, దోసకాయ, పుదీనా, వెల్లుల్లి, పెరుగు, ఉప్పుని తీసుకోండి. వీటన్నింటినీ మిక్స్ చేసి గాజు గ్లాసులో ఉంచుకోండి. కావాలంటే ఈ పానీయానికి తీపి పదార్థాలు కలుపుకోవచ్చు. ఇలా తయారైన రసాన్ని రోజువారి ఆహారంలో భాగంగా తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news