కోవిడ్ 19: మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన ఆహారం.. మునగకాయ.. ఎందుకో తెలుసుకోండి.

-

ఎవ్వరూ ఊహించని రీతిలో కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభణ విశృంఖలంగా ఉంది. పెరుగుతున్న కేసులు, జరుగుతున్న మరణాలు ఆందోళనకి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ నుండి కాపాడుకోవడానికి అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. ఐతే ఇంట్లో ఉంటూ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సరైన పోషకాహారాన్ని తీసుకుంటే కోవిడ్ బారిన పడకుండా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. పోషకాహారాల విషయానికి వస్తే శరీరానికి బలాన్ని అందించేవి ముఖ్యమైనవి. అందులో ఒకానొక ఆహారం మునగకాయ.

మునగకాయని భారతదేశంలో చాలా విరివిగా వాడతారు. మునగ ఆకులని, మునగకాడలని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం అందరికీ అలవాటే. కాకపోతే, ప్రస్తుతం దీన్ని మరింత బాగా వాడాలని, దానివల్ల వచ్చే లాభాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు. ఆ లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

యాంటీఆక్సిడెంట్

శరీరానికి హాని చేసే సూక్ష్మక్రిములతో పోరాడడానికి ప్రతిరక్షకాలు కావాలి. అవి వృద్ధి చెందాలంటే సరైన పోషకాలు కావాలి. ఆ పోషక విలువలున్న మునగకాయని ఆహారంలో చేర్చాలి. ఇది యాంటీఆక్సిడెంట్ గా పని చేసి, శరీరానికి హాని చేసే వాటిని నాశనం చేస్తుంది. ఇందులో ఐరన్, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి.

యాంటీ ఇన్ఫ్లమేటరీ

కోవిడ్ కారణంగా గొంతులో మంట పుడుతుందని విన్నాము. దాన్ని నివారించడానికి మునగకాయ బాగా పనిచేస్తుందని నిపునులు తెలియజేస్తున్నారు. అంతేకాదు మునగకాయని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి.

విటమిన్ సి

మహమ్మారి వచ్చినప్పటి నుండి విటమిన్ సి గురించి ఎక్కువగా వినబడుతుంది. రోగనిరోధక శక్తి పెంచే విటమిన్ సి, ప్రస్తుతం చాలా అవసరం. అవి మునగకాయలో చాలా ఉన్నాయి. అందుకే దీన్ని ఆహారంలో చేర్చుకోవాలి.

ఇంకా ఇందులో విటమిన్ బి, రైబోఫ్లేవిన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి శరీరానికి మేలు కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news