Catherine Tresa : కర్లీ హెయిర్​తో కవ్విస్తున్న కేథరీన్.. ఫొటోలు వైరల్

-

టాలీవుడ్ బ్యూటీ కేథరీన్ థెరిసా మరోసారి సోషల్ మీడియాలో తన హవా చాటింది. కర్లీ హెయిర్​తో కవ్వించే పోజులతో ఈ భామ మెస్మరైజ్ చేసింది. జిగ్​జాగ్ ప్యాటర్న్ డ్రెస్సులో తన అందంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం కేథరీన్ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

ఇద్దరమ్మాయిలు సినిమాతో కేథరీన్ తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్​లో తన సత్తా చాటింది. ఈ బ్యూటీ ఓవైపు టాలీవుడ్, మరోవైపు కోలీవుడ్​లలో బిజీగా నటిస్తోంది. ఇటీవలే బింబిసార, వాల్తేరు వీరయ్య సినిమాలతో హిట్లను తన ఖాతాలో వేసుకుంది.

చిన్నా పెద్దా తేడా లేకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగిం చేసుకుంటూ కేథరీన్ ఎక్కువగా లైమ్ లైట్​లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ తన సత్తా చాటుతోంది. తరచూ ఫొటోషూట్స్ చేస్తూ ఆ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. కేథరీన్ ఫొటోలు చూసిన కుర్రాళ్లు ఈ భామ అందానికి మెస్మరైజ్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version