Sadha : చీర అందాలతో యూత్‌ లో కాక రేపుతున్న సదా..ఫోటోలు వైరల్‌

బ్యూటిఫుల్ హీరోయిన్ సదా..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వెండితెరపైన ‘జయం’ చిత్రంతో సదా పర్ఫార్మెన్స్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గుర్తుంటుంది.

‘వెళ్లవయ్యా..వెళ్లు’ అనే చెప్పే డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి కూడా. ప్రస్తుతం ఈ భామ బుల్లితెరపైన కూడా సత్తా చాటుతోంది. డ్యాన్స్ ప్రోగ్రామ్ కు జడ్జిగా వ్యవహరిస్తున్నది సదా.

ఇకపోతే ఈ భామ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయిపోయారు. సదా బహుశా తన గ్లామర్ ను నెట్టింట పంచేందుకు సిద్ధమయినట్లుంది.

తాజాగా ఈ భామ గ్రీన్‌ కలర్‌ సారీ లో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. ఇన్ స్టా గ్రామ్ వేదికగా గ్రీన్‌ కలర్‌ సారీ లో అలా కూర్చొని చూపులతోనే కైపెక్కిస్తున్నది ఈ సుందరి.

అలా పరువాల ఆరబోతను కుర్రకారు తట్టుకోవడం కష్టమేనని ఈ ఫొటో చూస్తుంటే స్పష్టమవుతుంది. ఇక ఈ ఫొటో చూసి నెటిజన్లు ‘సో గార్జియ్, వావ్, బ్యూటిఫుల్, సూపర్, షీ ఈజ్ బ్యాక్’ అని కామెంట్స్ చేస్తున్నారు.