SaiPallavi : అబ్బో ఎంత సిగ్గో…వైట్ సారీ లో సాయి పల్లవి అందాల ఆరబోత

-

టాలీవుడ్‌ అగ్ర హీరోయిన్‌ సాయి పల్లవి .. ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ.. అటు కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనూ స్టార్డమ్ అందుకున్న హీరోయిన్ గా గుర్తింపు పొందింది.

ఇక ఈమె సినీ ఇండస్ట్రీలోకి ప్రేమమ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించినా.. తెలుగులో మొదటిసారి ఫిదా సినిమా తో అడుగుపెట్టి మంత్రముగ్ధుల్ని చేసింది.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్ల కంటే సాయి పల్లవి కొంచెం విభిన్నంగా ప్రవర్తిస్తూ.. మనసుకు నచ్చిన పాత్రలు మాత్రమే ఎంచుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కథ నచ్చక పోయినా.. పాత్ర ఇబ్బంది పెట్టినా.. పారితోషికం ఎక్కువ ఇస్తామని చెప్పినా.. రీమేక్ సినిమాలు అయితే నిర్మొహమాటంగా రిజెక్ట్ చేస్తూ ఉండడం గమనార్హం .

అందుకే యువత లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది సాయిపల్లవి. ముఖ్యంగా సాయి పల్లవి డ్రెస్సింగ్ సెన్స్ కు , డాన్స్ కు అమ్మాయిలు కూడా ఊహించిన స్థాయిలో అభిమానులుగా మారిపోయారు.

ఇక ఇటీవల సాయి పల్లవి నటించిన విరాట పర్వం బంపర్‌ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉండగా.. సాయిపల్లవి తెల్లటి చీర కట్టుకుని.. సిగ్గుపడుతున్న ఫోటోలు వైరల్‌ గా మారాయి. ఆ ఫోటోల్లో చాలా సిగ్గుపడుతూ.. సాయిపల్లవి కనిపించింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news