హీరో శ్రీవిష్ణు “అల్లూరి” ఫస్ట్ లుక్ రిలీజ్.. నిజాయితీకి మారుపేరు

-

సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు టాలీవుడ్ లో ఉన్న విలక్షణ నటుల్లో ఒకరైన శ్రీ విష్ణు. ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన శ్రీ విష్ణు తాజాగా ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రాబోతున్నాడు. ఈ చిత్రానికి “అల్లూరి” అనే టైటిల్ ని ఖరారు చేశారు.” నిజాయితీకి మారుపేరు” అనే ట్యాగ్ లైన్ ని ఆడ్ చేశారు. ఈ సినిమా తో ప్రదీప్ వర్మ దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు.

లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు కెరీర్లో మొట్టమొదటి పోలీస్ చిత్రంగా విశేషాన్ని సంతరించుకుంది. శుక్రవారం “అల్లూరి” చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా కయ్యద్ లోహర్ నటిస్తుంది. తనికెళ్ల భరణి, సుమన్, రాజా రవీంద్ర, పృథ్విరాజ్, రవివర్మ, మధుసూదన్రావు, జయవాణి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Read more RELATED
Recommended to you

Latest news