జామ ఆకులతో షుగర్ తగ్గుతుందా..?

-

ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న సమస్యల్లో షుగర్ కూడా ఒకటి. షుగర్ తో చాలా మంది సతమతమవుతున్నారు. అయితే మంచి జీవన్ శైలిని అనుసరించడం… ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటించడం వలన షుగర్ వంటి సమస్యల్ని దరిచేరకుండా చూసుకోవచ్చు. అయితే షుగర్ తో బాధపడే వాళ్ళకి జామ ఆకులు బాగా ఉపయోగపడతాయి.

 

జామ ఆకులతో షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జామ ఆకుల రసంలో యాంటీ-హైపర్గ్లైసీమిక్ లక్షణాలు ఉంటాయట. దీని వలన రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను అదుపులో వుంచుకోవచ్చు. అందుకే జపాన్‌ వంటి దేశాలలో దీన్ని తాగుతూ వుంటారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అయితే జామ ఆకులలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయని అంటోంది. దీనిలో ఫినాలిక్ శరీరంలో ఉత్పత్తి అయ్యే అదనపు చక్కెరను నియంత్రించడానికి హెల్ప్ చేస్తోంది.

అలిమెంటోథెరపీగా కూడా జామ ఆకులు ఉపయోగ పడతాయి. హైపోడిపోనెక్టినిమియా, హైపర్గ్లైసీమియా కూడా ఇంప్రూవ్ అవుతాయట. ఇలా చక్కటి లాభాలు వున్నాయి కనుక తూర్పు ఆసియా, ఇతర దేశాలలో జామ ఆకుల జ్యూస్ ని డయాబెటిస్‌ చికిత్సకు ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా జామా ఆకు తో టీ చేసుకు తాగడం వల్ల విరేచనాలు తగ్గుతాయి. అలానే శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news