ఆహారం తిన్నతర్వాత స్నానం చేస్తున్నారా? ఇంకేం పనులు చేస్తున్నారు!

-

ఇప్పుడున్న బిజీలైఫ్‌లో ఏ పనులకు పద్ధతిపాడు లేకుండా పోయింది. ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ఆకలితో మొదట తిండి తింటారు. తర్వాత చిరాకుగా ఉందని స్నానం చేస్తారు. అలా చేయకూడదని తెలుసినా.. ఏం కాదలే అని నిర్లక్ష్యం చేస్తుంటారు. తిన్న తర్వాత స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలియక అలా అంటారు. తెలిస్తే కొంతమేరకు పద్ధతిని మార్చుకుంటారు. ఆహారం తీసుకున్న తర్వాత ఇంకా చాలా పనులు చేయకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఆహారం తీసుకున్న తర్వాత కొన్ని విషయాలు చేయకూడదు. ముఖ్యంగా ఆహారం తీసుకున్న తర్వాత పండ్లు తినకూడదు. ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాతే ఫ్రూట్స్‌ తీసుకోవాలి. అలా కాదనుకుంటే ఆహారానికి గంట ముందు పండ్లు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

టీ తాగకూడదు: తేయాకులోని యాసిడ్స్‌ జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి.. టీ ఆహారానికి ముందు లేదా తర్వాత తీసుకోకూడదు.

స్మోక్‌ చేయకండి: ఆహారం తీసుకున్న తర్వాత ఒక సిగరెట్టే కదా అని తాగుతారు. ఆ సమయంలో ఒక సిగరెట్‌ పది సిగరెట్లతో సమానమని పరిశోధనల్లో తేలింది. తద్వారా క్యాన్సర్‌ వ్యాధి సోకే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బెల్ట్‌ లూజ్‌ చేయకూడదు: ఆహారం తిన్న తర్వాత పొట్ట బిర్రుగా ఉంటుంది. దీంతో ఫ్యాంటు బెల్ట్‌ లూజ్‌ చేస్తారు. అలా చేయడం వల్ల ఆహారం పేగుల్లోకి సత్వరితంగా చేరుకొని జీర్ణసమస్యలు ఏర్పడేలా చేస్తుంది.

స్నానం చేయకూడదు: భోజనం తిన్న తర్వాత స్నానం చేయడం వల్ల చేతులు, కాళ్లలో రక్తప్రసరణ వేగం అవుతుంది. దీంతో ఆహారం జీర్ణమయ్యేందుకు కావాల్సిన రక్త ప్రసరణ తగ్గుతుంది. దీనివల్ల ఉదరంలోని ఆహారం జీర్ణమవ్వడం తగ్గుతుంది. భోజనం చేసిన వెంటనే నడవకూడదు. తిన్న వెంటనే నడువడం ద్వారా ఆహారంలోని ధాతువులు, విటమిన్స్‌ ఆరోగ్యానికి సక్రమంగా లభించవు

నిద్రపోకూడదు : ఆహారం తీసుకున్న వెంటనే నిద్రిస్తే తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఇంకా గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఏర్పడుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news