తొమ్మిదేళ్ల ఎదురు చూపుల తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్.. దాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని చెప్పకతప్పదు. అందుకు అడ్డంకిగా ఉండే అంశాలను ఆయన ఒక్కొక్కటిగా చక్కబెట్టే పనిలో ఉన్నారు. తన ప్రధాన రాజకీయ శత్రువు అయిన చంద్రబాబును.. ఆయనకు అండగా నిలిచే ఆయన సామాజిక వర్గాన్ని జగన్ ఒక పద్దతి ప్రకారం.. దెబ్బకొడుతున్నట్టు కనిపిస్తోంది.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కమ్మ సామాజిక వర్గ ఆర్థిక పునాదులను దెబ్బతీస్తున్నాయి. ఆ వర్గం వచ్చే ఎన్నికల నాటికి ఆర్థికంగా దివాలా తీసేలా ప్లాన్ చేస్తున్నారు. కమ్మ సామాజిక వర్గం బేసిక్‌గా వ్యాపార వర్గం. అన్నింటి కన్నా రియల్ ఎస్టేట్ లో వారు చాలా యాక్టివ్. గతంలో హైదరబాద్ హైటెక్‌సిటీ విషయంలో ఏం చేసారో, అమరావతి విషయంలోనూ అదే చేశారని అంటుంటారు.
జగన్ అధికారంలోకి రాగానే.. రాజధానిని అలా ఎక్కడవున్నది అక్కడ వుం చేశారు. బతకినివ్వకుండా, చావనివ్వకుండా వదిలేశారు. దాంతో ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పడిపోయింది. లక్షల కోట్ల పెట్టుబడి అలా వుండిపోయింది. మైనింగ్ వ్యాపారంలోనూ కమ్మ వర్గానిదే డామినేషన్. ఆ లైసెన్స్‌లు రెన్యువల్స్ జగన్ హయాంలో కష్టంగా మారుతోంది. ఆర్థికంగా ఆ వర్గానికి ఇదో దెబ్బ.
మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ద్వారా కూడా జగన్ కమ్మ సామాజిక వర్గా వ్యాపారులను దెబ్బతీశారని చెప్పొచ్చు. ఇక టెండర్లు, కాంట్రాక్టుల విషయంలోనూ ఇదే జరుగుతోంది. రివర్స్ టెండరింగ్ అంటూ నవయుగ లాంటి పెద్ద సంస్థలు కూడా తలపట్టుకుంటున్నాయి. దీంతో ఆ రంగాన్ని నమ్ముకున్న కమ్మ సామాజికవర్గం ఇబ్బందుల్లో పడుతోంది.
ఇక రాజకీయంగానూ.. అధికార వర్గాల్లోనూ కమ్మ సామాజిక వర్గానికి పెద్ద పదవులు దక్కడం లేదు. నామినేటెడ్ పదవుల విషయంలోనూ అంతే సంగతులు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయవాడ, గుంటూరు, విశాఖ ప్రాంతాల్లోని కమ్మ వ్యాపారస్థులు బాగా లాభపడ్డారన్న టాక్ ఉంది. అమరావతి హడావుడి తగ్గడంతో వారూ ఇప్పుడు దెబ్బతిన్నారు.
ఇక అతి కీలకమైన మరో వర్గం మీడియా.. ఇప్పటికీ మీడియా ఎక్కువగా కమ్మ సామాజిక వర్గం చేతుల్లోనే ఉన్నా.. వారికి గతంలోలా కోట్ల కొద్దీ ప్రకటనలు వచ్చే అవకాశాలు లేవు. ఎల్లో మీడియాగా పేరున్న రెండు టీవీ ఛానళ్లపై నిషేధం జగన్ వైఖరికి నిదర్శంగా కనిపిస్తోంది. ఇలా మొత్తం మీద జగన్ ఓ పద్దతి ప్రకారం కమ్మ వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పక తప్పదు.