మనందరికి శనగలు తినటం ఇష్టం ఉంటంది కానీ, ఇది తింటే గ్యాస్ వస్తుంది, చీమిపడుతుంది అని అపోహలు చాలామందిలో ఉంటాయి. శనగల్లో నాటు శనగలు, కాబోలి శనగలు అని రెండు రకాలు ఉంటాయి. ఈరోజు మనం కాబోలి శనగల గురించి తెలుసుకుందాం. చపాతీలు, పూరీలకు కాబోలి శనగల కర్రీ చేసుకుంటారు. అసలు కాబోలి శనగలు వాడుకోవటం వల్ల ఏం ఏం పోషకాలు వస్తాయి.
నేషనల్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ నూట్రిషన్ (NIN) తార్నాక వాళ్లు ఇచ్చిన సమాచారం ప్రకారం 100 గ్రాముల కాబోలి శనగల్లో ఉండే పోషకాలు
- శక్తి 287 కాలరీలు
- కార్భోహైడ్రేట్స్ 40గ్రాములు
- మాంసకృతులు 19 గ్రాములు
- కొవ్వులు 5 గ్రాములు
- ఫైబర్ 25 గ్రాములు
- ఫొలిక్ యాసిడ్ 233 మైక్రో గ్రాములు
ఈ పోషకాలు అన్నీ కాబోలి శనగల్లో ఉన్నాయి. తేలిగ్గా డైజెషన్ అవుతాయి. గ్యాస్ ను తక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక ఈ కాబోలి శనగలు తినటం వల్ల మనకు వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..
ఇందులో ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ లో షుగర్ లెవల్ పెరగకుండా కంట్రోల్ చేస్తుందని సైంటిఫిక్ గా నిరూపించారు. భోజనంలో ఒక కప్పుడు ఉడికినశనగలు తింటే..36శాతం తిన్న ఆహారం ద్వారా వచ్చిన గ్లూగోస్ బ్లడ్ లోకి వెళ్లకుండా ఆగుతుందని 2017వ సంవత్సరంలో కాలేజ్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ కువైట్ యూనివర్శిటీ- కువైట్( College Of life Sciences Kuwait University) వారు పరిశోధన చేసి ఇచ్చారు. అంటే..కాబోలి శనగలు డయబెటీస్ వారికి అంతబాగా ఉపయోగపడుతున్నాయనమాట.
పెప్టైడ్ వైవై( peptide-YY) గ్లూకాగాన్ (Glucagon) ఇన్సులిన్ ఉత్పత్తిని బాగా పెంచుతుందట. ఇంకా ఇందులో ఉండే ఫైబర్ వల్ల మలబద్ధకం సమస్య బాగా తగ్గుతుందట. ప్రతిరోజు లంచ్ లో కాబోలి శనగలు వేసుకుని తినటం వల్ల జీర్ణక్రియకు బాగా పనికొస్తాయి. ప్రేగుల్లో ఇమ్యునిటీ బాగా పెరగడానికి ఉపయోగపడుతుందట.
కాబోలి శనగలను నానపెట్టి గ్రైండ్ చేసి పాలు తీసుకుని..ఆ పాలను కాచి తోడెస్తే..మాములు పాలలాగే పెరుగు వస్తుంది. ఈ పెరుగు గట్ బాక్టిరీయాకు ప్రోబయోటిక్ లాబా పనికొస్తుంది కూడా పరిశోధకులు తెలిపారు.
ఈ కాబోలి శనగల్లో మిత్యూనిన్న( Methionine) అనే యమైనో యాసిడ్ స్పెషల్ గా ఉంటుంది. ఇది లివర్ డీటాక్సిఫికేషన్ కు బాగా మేలు చేస్తుంది.
రక్తహీనత రాకుండా, కొత్తకణ నిర్మాణానికి ఫోలిక్ యాసిడ్ బాగా అవసరం. రోజుకు 400 మైక్రో గ్రాములు కావాలి. కాబోలి శనగల్లో 100 గ్రాముల్లోనే 233 మైక్రో గ్రాములు ఉంటుంది. గర్భిణీలకు, బాలింతలకు ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. ఇంకా రక్తహీనత సమస్యతో బాధపడేవారికి కూడా కాబోలి శనగలు బాగా మేలు చేస్తాయి.
ఇన్ని లాభాలు కాబోలి శనగల్లో ఉన్నాయి కాబట్టి వారానికి ఐదు రోజులు తిన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం కాబోళి శనగలతో కూర చేసుకుని చపాతీల్లో తినటమే కాదు..నానపెట్టి ఉడకపెట్టుకుని అవి మనం వండుకునే ఏ కూరల్లో అయినా వేసుకోవచ్చు. అలా వీటిని డైలీ వాడుకోవచ్చు. ఇలా డైలీ వాడుకోవటం వల్ల ప్రొటీన్ లోపం పోతుంది, మలబద్ధకం సమస్య పోతుంది, రక్తహీనత సమస్య పోతుంది. ఇంకా వీటి రుచి కూడా చాలా బాగుంటుంది. రుచితో పాటు ఆరోగ్యంగా ఉండేవి చాలా తక్కువగా ఉంటాయి. టేస్టీ ఫుడ్స్ హెల్త్ కు మంచివి కాదంటారు..కానీ ఇక్కడ టేస్ట్ తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి అందరూ వాడుకోవచ్చు.
-Triveni Buskarowthu