కొంతమంది చాలా ప్రశాంతంగా వుంటారు. కొంతమందికి మాత్రం కోపం చాలా ఎక్కువ ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి కూడా కోపం ఎక్కువ ఉందా కోప్పడే వారితో మీరు కలిసి ఉంటున్నారా…? అయితే కచ్చితంగా ఈ రిలేషన్ టిప్స్ ని పాటించాల్సిందే కొంతమంది చీటికిమాటికి కోప్పడుతూ ఉంటారు వాళ్ళలో కోపం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళతో మీరు లైఫ్ లాంగ్ ఉండాలన్నా.. మీ రిలేషన్షిప్ హెల్తీగా ఉండాలన్నా ఈ టిప్స్ ని కచ్చితంగా ఫాలో అవ్వండి.. మీరు మాత్రం శాంతంగా ఉండడం ఎంతో ముఖ్యం.
మీ జీవిత భాగస్వామి కోపంగా వున్నా మీరు మాత్రం దూకుడుగా ప్రవర్తించకూడదు. మీరు ప్రశాంతంగానే ఉండాలి ఒకవేళ కనుక మీరు కోప్పడితే పరిస్థితి చేయి జారిపోతుంది పైగా ఆ సీన్ ని ఆపడం కూడా కష్టం అవుతుంది కాబట్టి మీరు మీ ప్రశాంతతని అసలు కోల్పోకండి. అలానే మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కోపానికి గురి చేసే మాటలు మాట్లాడకండి. కోపానికి గురి చేసే మాటలు మాట్లాడితే వాళ్ళు ఇంకాస్త కోప్పడతారు.
ఎప్పుడూ కూడా మీరు మీ జీవిత భాగస్వామితో డీల్ చేసేటప్పుడు ప్రశాంతంగా గౌరవంగా మాట్లాడండి అప్పుడే మీ జీవిత భాగస్వామితో మీరు ఆనందంగా ఉండగలరు. కమ్యూనికేషన్ కీలక పాత్ర పోషిస్తుంది మీరు సరిగ్గా కమ్యూనికేట్ చేయాలి. ఒకవేళ కనుక మీరు సరిగ్గా వాళ్ళతో కమ్యూనికేట్ చేయకపోతే వాళ్ళు కోప్పడతారు కాబట్టి మంచిగా మాట్లాడండి. మీరు కోపంగా ఉండే వాళ్లతో జీవితాన్ని గడుపుతున్నట్లయితే మీ ప్రవర్తనని కూడా మీరు పరిశీలించుకోండి మీరు వారి కోపానికి దారి తీసే ప్రవర్తనని కానీ దూకుడు ప్రవర్తనని కానీ కలిగి ఉన్నట్లయితే కంట్రోల్ చేసుకోండి అప్పుడు మీ మధ్య ఇబ్బందులు ఏమీ లేకుండా ఉంటాయి కలిసి ఆనందంగా కలకాలం జీవించొచ్చు.