BREAKING: శరద్ పవర్ తో ఢిల్లీ సీఎం భేటీ…

-

ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతమని తెలిసిన విషయమే, ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నారు. కాగా ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త ఆర్డినెన్సు ను తీసుకువచ్చింది, ఢిల్లీ లోని ప్రభుత్వ అధికారుల బదిలీల ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలు ఉండవని, కానీ సుప్రీమ్ కోర్ట్ ఈ ఆర్డినెన్సు కు వ్యతిరేకంగా తీర్పును ఇస్తూ అధికారుల బదిలీలపై పూర్తిగా హక్కులు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయని తేల్చి చెప్పింది. ఇప్పుడు దీనిపై మళ్ళీ మరో పిటీషన్ ను వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దమవ్వడంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మిగిలిన రాష్ట్రాల నేతల మద్దతును కూడగట్టుకుని ప్రయత్నం చేస్తున్నారు.

 

 

అందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం సీఎం కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో పాటుగా ముంబై లో శరద్ పవర్ ను కలిసి వారి మద్దతును కోరారు. కాగా ఇప్పటికే మమతా బెనర్జీ మరియు ఉద్దవ్ ఠాక్రే లు మద్దతు పలికి ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news