ట్రెడ్ మిల్ మీద వర్కౌట్లు చేస్తున్నారా? ఐతే ఈ విషయాలు తెలుసుకోండి.

-

ఎక్సర్ సైజ్ చేయాలనుకునేవారు జిమ్ కి వెళ్తుంటారు. ఎక్సర్ సైజ్ కి కావాల్సిన అన్ని పరికరాలు అందులో ఉంటాయి కాబట్టి, ఒకే దగ్గర అన్ని రకాల వ్యాయామాలు చేసుకోవచ్చు. ఐతే జిమ్ లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఆ పరికరాల గురించి కనీస అవగాహన ఉండాలి. ముఖ్యంగా ట్రెడ్ మిల్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ట్రెడ్ మిల్ వాడుతున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలేంటో ఇక్కడ చూద్దాం.

ముందుగా, ట్రెడ్ మిల్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద అవగాహన ఉండాలి. మెషిన్ గురించి ఏ మాత్రం తెలియకుండా ప్రయోగాలు చేయవద్దు.

ఆల్రెడీ లోడ్ అయి ఉన్న ప్రోగ్రామ్‌ల గురించి తెలుసుకోండి. నడక కోసం, రన్నింగ్ కోసం, గుండె ఆరోగ్యం కోసం సెట్టింగ్స్ ప్రోగ్రామ్ చేయబడి ఉంటాయి.

వర్కౌట్ చేస్తు‌‌న్నపుడు, మీ గుండె స్పందనల రేటుని చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకోవడానికి ట్రెడ్ మిల్ కి సంబంధించిన వాచీ ధరించాల్సి ఉంటుంది.

రన్నింగ్ షూస్

పరుగెత్తడానికి ఉపయోగించే షూస్ కొనాలి‌. మంచి షూస్ ఉంటేనే మంచిగా వర్కౌట్లు చేయగలరు.

మధ్య మధ్యలో నీళ్ళు తాగడం మర్చిపోవద్దు అదే పనిగా చేయకుండా ఇంటర్వెల్స్ తీసుకోండి.

ఏది ఏమైనా ఎక్సర్ సైజ్ ప్రొఫెషనల్ ని సంప్రదించడం‌ మంచిది. మీరు సెపరేట్ గా కొనుక్కున్నా, జిమ్ కి వెళుతున్నా, పైన చెప్పిన విషయాలు గుర్తుంచుకోండి. ఇంకా  చెప్పాలంటే, ట్రెడ్ మిల్ తీసుకుని వర్కౌట్లు మొదలెట్టాలి అనుకునేవారు ముందుగా జిమ్ కి వెళ్ళి అక్కడ ఉన్న ప్రొఫెషనల్ చేత ట్రైనింగ్ తీసుకుంటే చాలా మంచిది. ఇంకేటి మరి జిమ్ లో జాయిన్ అయిపోండి.

Read more RELATED
Recommended to you

Latest news