ప్యాక్‌ చేసిన కొబ్బరినీళ్లు తాగుతున్నారా..? షాకిస్తున్న నిపుణుల స్టడీ..!

-

ఈ మధ్య ప్రతీది రెడీమేడ్‌గానే వస్తుంది. ఇడ్లీపిండీ, దోసపిండి, చపాతీలు, కూరలు ఇలా ప్రతీదీ రెడీమేడ్‌గా మనకు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. మొన్నామధ్య అయితే అరటిపండు తొక్క తీసి మరీ ప్యాక్ చేసి సూపర్‌ మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. అంత రెడీమేడ్‌ అయిపోయింది. కొబ్బరినీళ్లు కూడా విక్రయించే కొన్ని సంస్థలు ఉన్నాయి. అంటే కొబ్బరిబోండాలు కాదు.. కేవలం వాటర్‌ను మాత్రమే ప్యాక్‌ చేసి విక్రయిస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇలా ప్యాక్ చేసిన కొబ్బరినీళ్లు తాగొచ్చా..? ఇవి నిజంగా కోకనట్‌ వాటరేనా..? దీనిపై నిపుణులు ఇచ్చే సమాధానం ఏంటి..?

ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్ళు

ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్ళలో చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 330 ఎంఎల్ క్యాన్‌లో 15 గ్రాముల చక్కెర ఉంటుంది. అంటే దాదాపు 4 స్పూన్ల చక్కెర. ఇవి పాశ్చరైజ్ చేయబడతాయి. ఆస్ట్రేలియన్ చట్టం ప్రకారం.. ఈ నీటిని ప్యాక్ చేసే ముందు పాశ్చరైజ్ చేయాలి. ఇది భద్రతకు చాలా అవసరం. ఎందుకంటే కొబ్బరికాయ పగలగొట్టిన తర్వాత ఆక్సీకరణం చెందుతుంది. బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది. అందుకే, పాశ్చరైజేషన్ ద్వారా బ్యాక్టీరియాను తొలగిస్తారు. అయితే, ఈ ప్రక్రియ.. తాజా కొబ్బరి నీళ్ళ నుంచి మాత్రమే లభించే పోషకాలు, ఎలక్ట్రోలైట్‌లను కూడా ఇది నాశనం చేస్తుంది. ఎందుకంటే ప్యాక్ చేసే ముందు కొబ్బరి నీళ్ళని ఒక నిమిషం పాటు వేడి చేస్తారు. కొన్ని కంపెనీలు అయితే కనీసం వాటిని నాలుగు నిమిషాల పాటు వేడి చేస్తారు. ఇలా చేయడం వల్ల షుగర్ కంటెంట్ మరింత పెరుగుతుందట.

తాజా కొబ్బరి నీళ్ళ ప్రయోజనాలు

తాజా కొబ్బరి నీళ్ళలో కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్, ఐరన్, జింక్, సెలీనియం ఉంటాయి. ఇవి క్లోరైడ్ సీలు చేసిన కంటైనర్ కొబ్బరి నీళ్ళలో కనిపించే దానికంటే ఎక్కువగా ఉంటాయి.

తాజా కొబ్బరి నీళ్ళలో విటమిన్ బి2 ఉంటుంది. ఇది ప్రాసెస్ చేసిన కొబ్బరి నీటిలో ఉండదు. ఎందుకంటే విటమిన్ బి2 నీటిలో కరిగేది, కాంతి తగిలితే సులభంగా నాశనం అవుతుంది.

తాజా కొబ్బరి నీళ్ళలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ ఉంటాయి. ఇక వాటి చక్కెర కంటెంట్ కొబ్బరి బోండాం వయసుని బట్టి ఆధారపడి ఉంటుంది.

క్యాన్డ్ కొబ్బరి నీళ్ళలో సుక్రోజ్ ఎక్కువగా ఉంటుంది.

కొబ్బరి నీళ్ళు పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తాయని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.కొబ్బరి నీరు సెక్స్ హార్మోన్‌ని ప్రేరేపించే ఎండోక్రైన్ ని విడుదల చేస్తుంది. ఇది స్త్రీ, పురుషుల పునరుత్పత్తి అవయవాలపై సానుకూల ప్రభావం చూపుతుందని తేలింది.

కొబ్బరి నీళ్ళను తాగడం వల్ల లైంగిక పనితీరు మెరుగుపడుతుంది. ఇందులోని ఖనిజాలు పొటాషియం, జింక్, మాంగనీస్, విటమిన్లు రక్తప్రసరణ వ్యవస్థ మెరుగ్గా పని చేయడంలో సహాయపడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news