కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ ఆరోగ్యానికి మంచివి అయితే, కొన్ని కడుపు నొప్పిని కలిగిస్తాయి. రెండు వేర్వేరుగా తినడం మంచిదే కానీ.. రెండు కలిపి తినడం వల్లనే సమస్యలు వస్తాయి.. కొన్నిసార్లు ఇవి ఎలర్జీకి కూడా దారితీస్తాయి. ముఖ్యంగా జీర్ణసమస్యలు తలెత్తుతాయి. పుల్లటి పండ్లు తిని మళ్లీ తియ్యగా ఉండే పళ్లు తినకూడదు. అలా తినడం వల్ల..లోపల గందరగోళం అయి త్రేన్పులు వస్తాయి. అలాగే పాలతో అరటిపండ్లు తినడం కూడా మంచి కాంబినేషన్ కాదు. కానీ చాలా మంది పాలలో అరటిపండు వేసుకుని మిల్క్ షేక్ చేసుకోని తాగుతుంటారు. అరటిపండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న పండు అని మనకు తెలుసు. అరటిపండులో విటమిన్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫోలేట్, ఫైబర్, శరీరానికి అవసరమైన అనేక ఇతర అంశాలు పుష్కలంగా ఉన్నాయి.
కానీ అరటిపండ్లను పాలతో కలిపి తింటే కొందరిలో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి అలాంటి వారు ఈ కాంబినేషన్‌కు దూరంగా ఉండటమే మంచిది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండ్లు తింటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మధ్యాహ్నం అన్నంతో పండు తినడం కూడా మంచిది కాదు. ఎందుకంటే పండ్లు త్వరగా జీర్ణక్రియను నిర్వహిస్తాయి. కానీ మీ భారీ భోజనం జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ఇది ఉబ్బరం, ఇతర జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
పెరుగుతో చేపలు తినడం కూడా మంచి కలయిక కాదు. చేపల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. పెరుగు తేలికగా జీర్ణమవుతుంది. కాబట్టి చేపలను పెరుగుతో కలిపి తీసుకుంటే, అది మీ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ కలయికను కూడా నివారించండి. ముఖ్యంగా జీర్ణసమస్యలు ఉన్నవాళ్లు ఫుడ్ కాంబినేషన్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది తిన్నా ఈసీగా అరిగిపోతుంది. .మనకు అలాంటి సమస్యలు ఏం ఉండవు అనుకునేవాళ్లు.. ఎలా అయినా తినొచ్చు..!