మామిడి పండ్లు తింటున్నారా..? తిన్నాక వీటిని తింటే డేంజర్ లో పడ్డట్టేనా..? ఆయుర్వేదం ఏం అంటోందంటే..?

-

మామిడి పండ్లు: వేసవికాలంలో మామిడి పండ్లు ఎక్కువగా దొరుకుతుంటాయి. పైగా చాలా మందికి మామిడి పండ్లు అంటే ఎంతో ఇష్టం అందుకని ఎక్కువగా తింటూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఆహారం తీసుకునేటప్పుడు కాంబినేషన్ కనుక దెబ్బతింటే ఆరోగ్యం పాడవుతుంది అనేక రకాల సమస్యలు వస్తాయి కాబట్టి ఏదైనా ఫుడ్ ని తీసుకునేటప్పుడు దానితో పాటుగా మరో ఫుడ్ ని తప్పుగా తీసుకుంటే ఆ కారణంగా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే మరి మామిడి పండ్ల ని తిన్నాక ఎటువంటి ఆహార పదార్థాలను తినకూడదు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అనే ముఖ్య విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం.

మామిడి పండ్లు
మామిడి పండ్లు

మామిడి పండ్లు తీసుకున్న తర్వాత పెరుగు లేదా యోగర్ట్ ని తీసుకోకూడదు ఇలా తీసుకోవడం వలన రకరకాల ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే మామిడిపండ్లలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. పాలలో ప్రోటీన్లు ఉంటాయి కాబట్టి ఈ రెండు ఒకేసారి తీసుకున్న లేకపోతే మామిడి పండ్లు తిన్న తర్వాత వీటిని తీసుకున్నా బ్లోటింగ్, గ్యాస్, జీర్ణ సమస్యలు వంటివి కలుగుతాయి దీనివలన ఆరోగ్యం పాడవుతుంది అని ఆయుర్వేదం అంటోంది కాబట్టి ఈ కాంబినేషన్లో ఫుడ్ ని తీసుకోకండి.

మామిడి పండ్లు తీసుకున్న తర్వాత వెంటనే స్పైసీ ఫుడ్ ని తీసుకోవడం వలన కూడా యాసిడిటీ గుండెల్లో మంట స్టమక్ అప్సెట్ వంటివి కలుగుతాయి. మామిడిపండ్లలో షుగర్స్ ఉంటాయి అలానే ఆసిడ్స్ వలన స్టొమక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది దీంతో కడుపులో ఇబ్బంది, గ్యాస్, డయేరియా వంటి సమస్యలు కలుగుతాయి. మామిడి పండ్లు తీసుకున్నాక కాకరకాయను కూడా తీసుకోవద్దు దీనివలన కూడా ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఈ రెండు తీసుకోవడం వలన ఇంఫ్లమేషన్, యాసిడ్ రిఫ్లెక్స్ ఇవన్నీ ఇబ్బందులు కలుగుతాయి.

మామిడి పండ్లు తీసుకున్నాక వెంటనే నీళ్లు కూడా తీసుకోకండి. వెంటనే నీళ్లు తాగడం వలన ఆహారం జీర్ణం అవ్వడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ తప్పును కూడా అసలు చేయకండి. మామిడిపండ్లలో షుగర్ కంటెంట్ బాగా ఎక్కువగా ఉంటుంది దీన్ని తీసుకున్న తర్వాత కూల్ డ్రింక్స్ తాగడం వలన కూడా జీర్ణ సమస్యలు కలుగుతాయి కాబట్టి ఈ తప్పులను చేయకుండా చూసుకోండి లేకపోతే ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news