ఆకస్మాత్తుగా బరువు తగ్గిపోతున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!!

-

ఇప్పుడున్న ఆహార అలవాట్లు, జీవన విధానం పిల్లల్లోను, పెద్దల్లోను ఓబేసిటీ కీ దారి తీస్తున్నాయి. బరువు తగ్గేందుకు చాలామంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఏ ప్రయత్నం చేయకుండా, బరువు తగ్గాలనే ఆలోచన లేనివారు కూడా ఉన్నట్టుండి ఒక్కసారిగా బరువు తగ్గడం ప్రారంభిస్తే ఆందోళన చెందాల్సిన విషయమే.

అయితే, చాలామంది ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోరు. బరువు తగ్గడం కొన్నిసార్లు మన ఆరోగ్య పరిస్థితిని కూడా సూచిస్తుందని తెలుసుకోవాలి. బరువు ఉన్నట్టుండి తగ్గుతుంటే శరీరంలో తీవ్రమైన జబ్బులు అభివృద్ధి చెందుతున్నట్టు తెలుసుకోవాలి. అనేక తీవ్రమైన రోగాలు వచ్చిన తర్వాత కూడా బరువు వేగంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఏయే జబ్బులు వల్ల త్వరగా బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

కేన్సర్ వ్యాధి…. ఉన్నట్టుండి వేగంగా బరువు తగ్గిపోతూ, నీరసం, ఏ పని మీద ద్యాస లేకుండా ఉండడం వంటి లక్షణాలు కన్పిస్తుంటే వెంటనే వైద్యనిపుణులను సంప్రదించాలి. ఆహారం- దినచర్యలో ఎటువంటి మార్పు లేకపోయినా, వేగంగా బరువు కోల్పోతున్నట్లయితే, అది కేన్సర్ లక్షణం కావచ్చు.

థైరాయిడ్ – స్త్రీలలో ఈ మధ్యకాలంలో ఎక్కువుగా కనిపిస్తున్న వ్యాధి థైరాయిడ్.థైరాయిడ్ రెండు రకాలు . ఒకటి బరువు వేగంగా పెరగడం, మరొకటి బరువు వేగంగా తగ్గడం. థైరాయిడ్ జీవక్రియపై డైరెక్టగా ప్రభావాన్ని చూపుతుంది. థైరాయిడ్ కారణంగా శరీరంలో జీవక్రియ మందగించినప్పుడు, బరువు పెరగడం ప్రారంభమవుతుంది. మరోవైపు, జీవక్రియ వేగవంతం కావడం ప్రారంభిస్తే, బరువు వేగంగా తగ్గడం ప్రారంభమవుతుంది. నిరంతరం తగ్గుతున్న బరువు కారణంగా, కొన్నిసార్లు ఇది పెరిగి గుండె కొట్టుకోవడం, ఆందోళన, నిద్ర లేకపోవడం వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. ఇవన్నీ హైపర్ థైరాయిడిజం లక్షణాలు.

రుమటాయిడ్ ఆర్థరైటిస్… రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల మరీ ముఖ్యంగా 40 నుండి 50సంవత్సరాల వయసు వారికి కీళ్ళనొప్పులు,క్యాల్సియం తగ్గి ఎముకల్లో శక్తి తగ్గిపోవడం, ఉన్నట్టుండి బరువుతగ్గడం వంటి లక్షణాలు వుంటే రుమటాయిడ్ఆర్థరైటిస్ కి దారిటేసినట్టే అని..దీని గురించి వైద్యున్ని వెంటనే సంప్రదించాలి.

Read more RELATED
Recommended to you

Latest news