నడుము నొప్పి బాధిస్తోందా.. ప్రతిరోజు ఈ ఆహారం తీసుకోండి..!!

-

ఈమధ్య కాలంలో కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంటికే పరిమితం అవుతూ వర్క్ ఫ్రం హోం పేరిట ఇంట్లో కూర్చుని ఉద్యోగాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఒకే చోట కూర్చుని పనులు చేయడం వల్ల వెన్నెముక మీద భారం పడి వెన్నునొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక జీవనశైలిలో మార్పుల కారణంగా తినే తిండి , పానీయాల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే ఇలా వెన్ను నొప్పితో బాధపడాల్సి ఉంటుంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ.. దృఢమైన జీవనశైలిని మీరు ఫాలో అయితే కచ్చితంగా ఎటువంటి సమస్యలు మిమ్మల్ని దరిచేరవు. ఇకపోతే వెన్నెముకకు బలం చేకూర్చే ఆహార పదార్థాలు ఏమిటో ముందుగా తెలుసుకొని.. వాటిని తినడం వల్ల ఇలాంటి సమస్య నుంచి దూరం అవ్వచ్చు.

అధిక ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరం లో ఎసిడిటీ పెరగడం మొదలవుతుంది. ఇక అప్పుడు కాల్షియం టాయిలెట్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఎముకలకు బలం చేకూరదు. కాబట్టి పరిమిత పరిమాణంలో ప్రోటీన్ తినడం వల్ల కాల్షియం ఎముకలకు అందుతుంది. కానీ మీరు ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే మాత్రం ఎముకలను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రోటీన్ అధికంగా ఉండే పదార్థాలను పరిమితిలో మీరు తీసుకోవాలి.

ఇకపోతే కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోకూడదు. ముఖ్యంగా కాఫీలాంటి పదార్థాలను తీసుకోవడం వల్ల అది మీ ఎముకలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి అలాంటి వాటికి అలవాటు పడితే కాల్షియం లోపం ఏర్పడుతుంది. కాబట్టి కెఫిన్ ను దూరంగా వుండి పాల ఉత్పత్తులను తీసుకోవడం చాలా అవసరం.

ముఖ్యంగా ఎముకలు దృఢంగా ఉండాలి అంటే కాల్షియంతో పాటు విటమిన్ డి కూడా చాలా అవసరం కాబట్టి ఈ రెండు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మరింత బలంగా తయారవుతాయి. ఇక అలాగే బాదం, వాల్ నట్స్ లాంటివి తినడం వల్ల ఎముకలు బలపడతాయి. బాదంపప్పులో క్యాల్షియం, విటమిన్ లు ఉండడం వల్ల వెన్నెముక సమస్యలు తగ్గిపోతాయి. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే చేపలు కూడా మీ ఆరోగ్యానికి మరింత ప్రయోజనాన్ని చేకూరుస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news