మహిళలు పైకి బానే ఉంటారు కానీ.. వారికి చాలా సమస్యలు ఉంటాయి.. పిరియడ్ ప్రాబ్లమ్స్ చాలనట్లు.. కొంతమందికి వైట్ డిశ్చార్జ్ అవుతుంది. దీనివల్ల ఎలాంటి హాని కలగపోయినా.. ఇలా జరగడం అనేది మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. అధిక వైట్ డిశ్చార్జ్ బలహీనత, ఇన్ఫెక్షన్లకు కూడా దారి తీస్తుంది. కాబట్టి దీనికి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.. వాస్తవానికి డిశ్చార్జ్ రంగు బూడిదరంగు తెలుపు, ఆకుపచ్చ, పసుపు లేదా గోధుమ రంగులో ఉంటే అది తీవ్రమైన సమస్యను కలిగిస్తుంది. యోని దురదతో కూడిన చిక్కటి వైట్ డిశ్చార్జ్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. మీకు కూడా ఈ సమస్య ఉంటే.. వాటిని కొన్ని చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు..మరి ఆ చిట్కాలు ఏంటో చూద్దామా..!!
మెంతి గింజలను నీటిలో ఉడకబెట్టడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మీరు మెంతులు గింజలను 500 మి.లీ నీటిలో వేసి నీరు సగానికి వచ్చే వరకు ఉడకబెట్టవచ్చు. చల్లారిన తర్వాత ఈ నీటిని తాగాలి.. బెండకాయ చాలా మందికి ఇష్టమైన కూరగాయ. వైట్ డిశ్చార్జ్ సమస్యకు చికిత్స చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. బెండకాయలను ఎక్కువగా వాడటం, పెరుగుతో బెండకాయ కూర చేసుకుని తినడం వంటివి చేస్తుండాలి.
కొన్ని ధనియాల గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి, వడకట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినండి. వైట్ డిశ్చార్జ్ సమస్యకు ఇది సులభమైన, సురక్షితమైన మార్గం.తులసిని నీటితో మెత్తగా రుబ్బుకోవచ్చు. దానికి కొంచెం తేనె కలపండి.. దీన్ని రోజుకు రెండుసార్లు తినండి. తులసిని పాలతో కూడా తీసుకోవచ్చు.వైట్ డిశ్చార్జ్ సమస్య నుండి ఉపశమనం పొందడానికి మీరు రైస్ స్టార్చ్ అంటే బియ్యాన్ని క్రమం తప్పకుండా ఉడకబెట్టిన నీటిని తాగవచ్చు.
మీకు దురదతో యోని స్రావాలు ఉంటే మీరు కొన్ని జామ ఆకులను నీటిలో వేసి మరిగించి చల్లారిన తర్వాత తాగవచ్చు. దీన్ని రోజుకు రెండుసార్లు తాగండి. జామ ఆకుల టీ ఆరోగ్యానికి చాలా మంచిది.. గూస్బెర్రీని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. విటమిన్ సి , అనేక ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.