పిల్లులను పెంచితే అక్కడ రెచ్చిపోతారట..కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

‘టోక్సోప్లాస్మా’ ప్రమాదకర పరాన్నజీవి కాదని, పైగా దీనివల్ల వారికి ఆరోగ్యం కూడా లభిస్తుందని చెప్పడం విశేషం. ‘టోక్సోప్లాస్మా’ను కలిగిన స్త్రీ, పురుషులిద్దరూ అందంగా, ఆకర్షణీయంగా మారినట్లు పరిశోధకులు వెల్లడించారు. అంతేకాదు. ఈ పరాన్నజీవి మనుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుందని, దీనివల్ల సాధారణం కంటే ఎక్కువగా శృంగారంలో పాల్గొంటారని తెలిపారు. ఈ పరాన్నజీవి కొన్ని హార్మోన్లను యాక్టీవ్ చేయడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు..

 

పిల్లులను ఎక్కువగా పెంచుకొనే బ్రిటన్ ప్రజల్లో ‘టోక్సోప్లాస్మా’ను ఎక్కువగా కనుగొన్నారట. ఆ దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ పరాన్నజీవిని మోస్తున్నారట. వాస్తవానికి ఈ పరాన్నజీవి ఎక్కువగా పిల్లి మలమూత్రల్లో ఉంటుంది. వాటిని క్లీన్ చేసేప్పుడు యజమానులకు ఆ పరాన్నజీవి సంక్రమిస్తుంది. అయితే, ‘టోక్సోప్లాస్మా’ను మోస్తున్నామనే సంగతి చాలామందికి తెలియదట.

టోక్సోప్లాస్మా పరాన్నజీవి సోకిన వారు మూడవ వంతు మరింత ఆకర్షణీయంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. మహిళలు కూడా తక్కువ బరువును కలిగి ఉన్నారు. అయితే, ఈ పరాన్నజీవి మానవులపై ఇలా ఎందుకు పనిచేస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.హార్మోన్లుగా పేర్కొన్న సెరోటోనిన్, డోపమైన్‌ ఉత్పత్తిని నియంత్రించే జన్యువులతో ఈ పరాన్నజీవి కలవడం వల్లే ఈ ప్రయోజనం లభిస్తోందని భావిస్తున్నారు..లైంగిక హార్మొన్లు పెరిగి శృంగార సామర్ధ్యాన్ని పెంచుతాయని నిపుణులు అంటున్నారు..అది అసలు మ్యాటర్..