లంఖణం పరమౌషధం అన్న కాలిఫోర్నియా వైద్యులు..!

-

నిన్న మొన్నటి వరకు మన పెద్దలు జ్వరం వచ్చినప్పుడు చెప్పిన లంఖణం గురించి అందరూ కొట్టిపారేశారు. కొత్త వైద్య విధానం అనుసరించే ఎందరో వైద్యులు, అభ్యుదయవాదులు ఇదంతా కేవలం అనాగరికం అని, మూర్ఖత్వం అని ఎద్దేవా చేసారు. కానీ నేడు లంఖనం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. పూర్వం జ్వరాలు కానీ ఏదైనా పెద్ద రుగ్మతలు వచ్చినప్పుడు లంఖణాలు చేయించే వారు మన పెద్దలు. లంఖణం అంతే మూడు రోజుల పాటు ఆహారం ఏమి తినకూడదు అన్నమాట. దానివల్ల ఎలాగూ నీరస పడేవారు. వరుసగా మూడు రోజులు నిరాహారంగా ఉండడం వలన శరీరం కొత్త స్టెమ్ సెల్స్ తయారు చేస్తుందని అంటున్నారు.

తద్వారా తెల్ల కణాలను సృష్టించి రోగ నిరోధక శక్తిని అమితంగా పెంచుతుంది. తద్వారా జబ్బు పడ్డ వ్యక్తి కొత్త శక్తి కలిగి అనారోగ్యం నశిస్తుంది. ఈ విషయాన్ని సథరన్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు వారి పరిశోధన లో కనుగొన్నారు. కాబట్టి అన్నింటికీ ఆంటి బయోటిక్స్ మందులు వాడటం మంచిది కాదు. ఆంటీ బయోటిక్స్ మాత్రమే మందులని మనకు బాగా తల కెక్కించారు.

Read more RELATED
Recommended to you

Latest news