డయబెటిక్ పేషెంట్స్ బెండకాయను తినొచ్చా..?

-

బెండకాయ.. అలియాస్.. లెక్కల మాష్టర్. మరి అంతే కదా.. చిన్నప్పటి నుంచి పెద్దోళ్లు ఇదే చెప్తారు.. బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయని.. కేజీల కొద్దీ తిన్నా.. కొందరికి పాపం ఈ లెక్కలు మాత్రం వచ్చేవి కావు. అసలు బెండకాయకు లెక్కలకు సంబంధం ఏంటో మనం తర్వాత చూద్దా కానీ.. బెండకాయకు, మధుమేహానికి ఉన్న సంబంధం గురించి ఈరోజు తెలుసుకుందాం.. !

diabetes

షుగర్ రోగులకు బెండకాయలు దివ్యౌషదంగా పనిచేస్తుంది. డయబెటి పేషెంట్స్.. సాధరణంగా కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఏదైతే.. రక్తంలో చెక్కర స్థాయిని పెంచదో అవి మాత్రమే తినాలి. అలాంటి ఆహారాల్లో ఒకటి.. బెండకాయ. బెండలో పైబర్‌, విటమిన్స్‌ మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

ఇందులో ఎ,బి1 , బి2. బి3, సి, ఈ కె విటమిన్లు ఉంటాయి. అలాగే కాల్లియం, అరన్న్‌ మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ పొటాషియం, జింక్‌ వంటి మినరల్స్‌ లభిస్తాయి. ఫైబర్‌ కూడా ఎక్కువగానే ఉంటుంది. తక్కువ క్యాలరీలు గల బెండకాయలు షుగర్‌ పేషంట్స్‌ కే కాదు. అందరికీ మంచిదే… మధుమేహంతో బాధపడే వారు బెండకాయలను తమ డైట్‌లో భాగం చేసుకోవటం వల్ల శరీరంలో గ్లూకోజ్‌ లెవెల్స్‌ను కంట్రోల్‌ చేయడంతోపాటుగా, మలబద్దకం వంటి సమస్యను తగ్గిస్తుంది.

బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కంట్రోల్‌ చేయడానికి బెండకాయలు అద్భుతంగా పనిచేస్తుంది.. దీని వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి, బీపీ, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. గర్భధారణ సమయంలో రక్తంలో షుగర్ లెవల్స్ ను సమతుల్యం చేయటంలో బెండకాయలు బాగా ఉపయోగడతాయి. అందుకే గర్భిణీలు బెండకాయలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోమని పోషకాహార నిపుణులు చెప్తుంటారు.

బెండకాయలు, గింజలను ఎండలో ఆరబెట్టి పిండిలా చేసి ఆహారంలో కలిపి తీసుకోవచ్చు.. బెండలో ఫ్లెవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో ఉండే మైరిసెటిన్ శరీరంలో షగర్ ను నియంత్రణలో ఉంచటంతోపాటు క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండూ కాపాడుతుంది. పేగు సమస్యలు ఉన్నవారు బెండకాయలకు దూరంగా ఉండటం మంచిది. బెండకాయలను ఆవిరిపై ఉడికించుకుని తినటం మంచిది. వేపుళ్లు వంటి వాటిని చేసుకోవటం తినటం అస్సలు మంచిది కాదు.. దీనివల్ల పైన చెప్పుకున్న పోషకాలు అన్ని పోతాయి. మీకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది.

బెండకాయలో జిగిరు ఎగిరిపోతుంది. ఇక తిన్నా వేస్ట్.. లేత బెండకాయలను ఉప్పు, కారం తక్కువగా వేసి.. పెరుగు వేసుకుని తింటే అన్ని పోషకాలు అందుతాయి. ఎక్కువ సేపు మగ్గించకుండా.. పచ్చివాసన పోయే వరకూ ఉంచితే చాలు. ఇలా బెండకాయను చేసుకుని తింటే.. ఆరోగ్యానికి చాలా మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news