వెల్లుల్లి, చింతపండు రసంతో ఇమ్యూనిటీ డబుల్‌!

సెకండ్‌ వేవ్‌ కరోనా విజృంభిస్తోంది. మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వ్యాధి నిరోధక శక్తిని లోపలి నుంచి పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మందులతో పాటు మరి కొన్ని ఇంటి చిట్కాలతో ఇమ్యూనిటీ పవర్‌ ను పెంచుకోవడం మంచిది. సాధారణంగా మన ఇళ్లలో వాడే వెల్లుల్లి చింతపండు రసం వంటి వాటితో ఇమ్యూనిటీ బూస్ట్‌ అవుతుంది. ఇది మన అమ్మమ్మల తరం నుంచి ఇది అందుబాటులో ఉంది. ఇది చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఈ రసం ఆరోగ్యాన్ని పెంచుతుంది. వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. దీన్ని సులభంగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.


కావాల్సినవి:

1 టేబుల్‌ స్పూన్‌ చింతపండు రసం, 1 టమాట (చిన్నగా తరగాలి), కరివేపాకులు 12, మిరియాలు 2 టేబుల్‌ స్పూన్లు. , వెల్లుల్లి – 5 రెబ్బలు, పసుపు – అర టీస్పూన్, ఎండుమిర్చి 2, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీస్పూన్, ఇంగువ – అర టీస్పూన్‌ , కొత్తిమీర – 1 కట్ట తరిగి ఉంచుకోండి, నూనె 1 టేబుల్‌ స్పూన్, ఆవాలు 1 టీస్పూన్‌ు .

రసం తయారీ విధానం:

ముందుగా స్టావ్‌ ఆన్‌ చేసి, ప్యాన్ లో ఎండు మిర్చిని కొద్దిగా ఫ్రై చేసి, తర్వాత వాటిని మిక్సీ జార్‌లో వెయ్యాలి. వాటితోపాటూ మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, 5 కరివేపాకులు వేసి, గ్రైండ్‌ చెయ్యాలి. వాటిని పక్కన పెట్టండి. ఇప్పుడు మళ్లీ ప్యాన్‌ తీసుకొని… నూనె వేసి, వేడయ్యాక టమాటా ముక్కలు వెయ్యండి. మిగిలిన 7 కరివేపాకులు వెయ్యండి. పసుపు, ఉప్పు వెయ్యండి. 4 నిమిషాలు మీడియం మంటపై వేయించాలి . ఇప్పుడు ఇదివరకు మనం గ్రైండ్‌ చేసిన పొడిని వేసేయండి. అలాగే చింతపండు గుజ్జు వెయ్యాలి. వెంటనే 2 కప్పుల నీరు పొయ్యాలి. చిన్న మంట పెట్టి… మూత పెట్టి… 10 నిమిషాలు ఉడకనివ్వాలి.
మరో ప్యా¯Œ లో కొద్దిగా నూనె వేడి చెయ్యాలి. వెంటనే ఆవాలు వెయ్యాలి. ఎండు మిర్చి, ఇంగువ వేసి అటూ ఇటూ కదపాలి. ఆవాలు చిటపటలాడాక, వాటిని మరుగుతున్న రసంలో వేసి 10 నిమిషాల తర్వాత స్టవ్‌ ఆపేసి… రసంలో… కొత్తమీర వేసి కలపాలి. అంతే ఘుమఘుమలాడే రసం రెడీ.