షుగర్‌ పేషెంట్స్‌ పాలు తాగొచ్చా..? తాగితే ఎలాంటివి తాగాలి..

-

పాలు అంటే ఆరోగ్యానికి మంచిది అని అందరూ అంటారు. కానీ కొంతమందే పాలను ఇష్టపడతారు. చాలామందికి పాలు అంటే అస్సలు నచ్చదు. షుగర్‌ పేషంట్స్‌ తినే ప్రతి ఆహారం మీద శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది. అధి వారి షుగర్‌ లెవల్స్‌ పెంచేదా కాదా అని తెలుసుకున్నాకే తినాలి. కానీ చాలామంది.. డయబెటిక్‌ బారిన పడ్డాక కూడా.. ఆహారం విషయంలో సరైన జాగ్రత్తలు పాటించరు. ఇంట్లో అందరికి వండినవే తినేస్తుంటారు. రైస్‌ తగ్గించాలని వైద్యులు చెప్తారు కానీ పల్లెటూర్లలో ఉండేవాళ్లు అన్నం మాత్రమే తినగలుగుతారు. అదే క్రమంలో పాలు కూడా. పాలతో కాఫీ, టీలు లేదా ఉత్తి పాలనే తీసుకుంటుంటారు. అసలు షుగర్‌ పేషంట్స్‌ పాలు తాగొచ్చా..? మంచిదేనా..?

పాలు తాగొచ్చా..?

పాలు ఆరోగ్యానికి మంచిదే.. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులు.. దీనిని తగ్గించడం లేదా తీసుకోకపోవడం మంచిదంటున్నారు నిపుణులు. మధుమేహం ఉన్నవారు పాలు పరిమిత పరిమాణంలో తీసుకోవచ్చు. అయితే, ఎప్పుడూ పూర్తి క్రీమ్ అంటే వెన్న ఉన్న పాలు తాగకూడదన్న విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. టోన్డ్ లేదా ఆవు పాలు తాగొచ్చు. అలాగే రాత్రి పడుకునే ముందు పాలు తాగకూడదు. ఒకవేళ తాగాలనుకుంటే.. పడుకునే 1 లేదా 2 గంటల ముందు మాత్రమే పాలు తాగాలి.

ఈ విషయాలను తెలుసుకోండి..

మధుమేహ వ్యాధిగ్రస్తులు నిద్రపోయే ముందు లేదా పడుకునే ముందు పాలు తాగవద్దు.
నిద్రించడానికి, పాలు తాగడానికి మధ్య కనీసం 2 గంటల గ్యాప్ ఉండాలే చూసుకోండి.
పూర్తి క్రీమ్ పాలు తాగడం మానుకోండి. ఇది చాలా కొవ్వును కలిగి ఉంటుంది, దీని కారణంగా కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.
రోజంతా 1 గ్లాసు కంటే ఎక్కువ పాలు తాగవద్దు.
అదే సమయంలో, సాధారణ పాలకు బదులుగా, పాలలో పసుపు లేదా దాల్చిన చెక్కను కలిపి తాగవచ్చు. ఇది వ్యాధులను నివారించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

పాలు తాగాలనుకునే డయబెటిక్స్‌ ఈ విషయాలను మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి.! ఆరోగ్యానికి మంచివే అయినా..అవి అన్నిసార్లు అందరికీ మేలు చేయవు. కాబట్టి కొవ్వులేని పాలనే తీసుకోవడం ఉత్తమం.

పైన పేర్కొన్న అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే..ఆరోగ్యపరమైన సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించగలరు.

Read more RELATED
Recommended to you

Latest news