పరీక్షల సమయంలో పిల్లలకు ఈ ఆహారాన్ని తప్పక ఇవ్వాలి..

-

మే నెల వచ్చిందంటే పిల్లలు హడావుడి గా ఉంటారు..ప్రతి ఒక్కరికి పరీక్షల సమయం..ఈ సమయంలో పిల్లలు పుస్తకాలకు అతుక్కుపోతారు. పరీక్షలను బాగా రాసి మంచి మార్కులను సంపాదించడం కోసం.. ఏడాదంతా చదివిన పాఠాలను మళ్లీ తిరగేస్తూ ఉంటారు.దాంతో వాళ్ళ బ్రెయిన్ కూడా అలాగే తిరుగుతుంది. పిల్లలకు నిద్ర, తిండి సరిగ్గా ఉండదు..ఎంత 24 గంటలు చదివినా కూడా పిల్లలకు కంటి నిండా నిద్ర, మంచి ఆహారం ఉండాలి..అప్పుడే పిల్లలు ఎగ్జామ్స్ బాగా రాస్తారు.వారికి మంచి డైట్ ఫుడ్ ను ఇవ్వాలని ఆహార నిపుణులు అంటున్నారు.మరి ఆలస్యం లేకుండా ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాము..

చేపలు: ప్రస్తుత వేసవి కాలంలో ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. చేపల్లో విటమిన్స్‌, మినరల్స్ తో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా నిండి ఉంటాయి. అందువల్ల, పరీక్షల సమయంలో వీటిని తీసుకుంటే మెదడు చురుగ్గా పని చేస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత రెండూ రెట్టింపు అవుతాయి.

టమోటా:టమాటోను సూప్ రూపంలో తీసుకుంటే.. మెదడు సామర్థ్యం పెరుగుతుంది. ఒత్తిడి, తలనొప్పి, మతిమరపు వంటి సమస్యలు దూరం అవుతాయి.

నట్స్: ఎగ్జామ్స్ టైంలో పిల్లలు ఎక్కువ నీరసంగా మారతారు.శరీరానికి నట్స్ మంచి ఎనెర్జీని అందిస్తాయి.పరీక్షల సమయంలో బాదం పప్పు, వాల్‌నట్స్‌, పిస్తా పప్పు, జీడిపప్పు వంటి నట్స్‌ను తీసుకోవాలి.

పాలకూర:ఇది ఓ అద్భుతమైన ఆకుకూర. పరీక్షల సమయంలో పాలకూరను తీసుకుంటే శరీరానికి కావాల్సిన బోలెడన్ని పోషకాలు లభిస్తాయి. ఇమ్యూనిటీ రెట్టింపు అవుతుంది. నీరసం, అలసట వంటివి దరి చేరకుండా ఉంటాయి.

గుడ్డు: రోజుకు ఒక ఉడికించిన గుడ్డును తింటే పరీక్షల సమయంలో ఆరోగ్యంగా, బలంగా, చురుగ్గా ఉంటారు. ఇక ఈ ఐదు ఆహారాలతో పాటు మంచి నీళ్ళను కూడా ఎక్కువగా ఇవ్వాలి.. కనీసం రోజుకు 4 నుంచి 5 లీటర్ల నీటిని ఇవ్వడం చాలా మంచిది.ఈ ఐదు ఆహారాలను క్రమం తప్పకుండా ఇస్తే విద్యార్థులు చురుగ్గా ఉంటారు.పరీక్షలను బాగా రాస్తారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version