ఐస్ క్రీమ్ తలనొప్పి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా…?

ఐస్ క్రీమ్ తలనొప్పి చాలా మంది లో వస్తుంది, ఎప్పుడైనా వాతావరణం చాలా చల్లగా ఉన్నా లేదా చల్లగా వున్నా వాటిని తిన్నా తాగినా ఈ తల నొప్పి వస్తుంది. దీనినే ఐస్ క్రీమ్ తలనొప్పి అంటారు. అలాగే ఇది ఒక్క సారిగా వాతావరణం చాలా చల్లగా అయి పోయినప్పుడు కూడా వస్తుంది. ఈ ఐస్ క్రీం తల నొప్పినే cold stimuli headache అంటారు. మైగ్రేన్ తో బాధపడే వాళ్లకు ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది.

దీని నుంచి బయట పడడం ఎలా…?

ఈ తల నొప్పి నుంచి బయట పడాలంటే ఇక్కడ ఉన్న పద్ధతుల్ని అనుసరించండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి మీరు సులువుగా బయట పడొచ్చు. దీని కోసం మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళుతుంటే మీ తలని క్లాత్ తో కట్టేసుకోండి.

ఐస్ మ్యూజియమ్స్ లేదా చల్లటి ప్రాంతాలకి వెళుతున్నప్పుడు చలికి తట్టుకునే దుస్తులు ధరించండి. ఇలా చేయడం వల్ల మీరు కాస్త రిలీఫ్ గా ఉండొచ్చు. పైగా అంత వేగంగా అది మీకు రాకుండా ఉంటుంది.

లేదా ఒకవేళ మీరు చల్లనివి ఏమైనా తీసుకున్నా కూడా తలనొప్పి వస్తుంది అని అనుకుంటే అప్పుడు గోరు వెచ్చని నీళ్లు తాగడం లాంటివి పాటించండి. ఇలా చేయడం వల్ల కూడా మీరు రిలీఫ్ గా ఉండొచ్చు. ఇలా చిన్నచిన్న చిట్కాలు మీరు పాటిస్తే ఇది రాకుండా జాగ్రత్త ముందుగా జాగ్రత్త పడచ్చు.