వీటిని కుక్కర్ లో వేసి ఉడికించద్దు..!

-

చాలామందికి ఉండే అలవాటు ఏమిటంటే వంటగదిలో వంట చేసేటప్పుడు త్వరగా అయిపోతుందని ప్రెషర్ కుక్కర్ లో వేగంగా ఆహారపదార్థాలను పెట్టి వండేస్తూ ఉంటారు. మామూలుగా అన్నంతో పప్పు, మాంసం దుంపలు మొదలైనవి ప్రెషర్ కుక్కర్ లో వండేస్తూ వుంటారు. అయితే ప్రెషర్ కుక్కర్ లో మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఆహార పదార్థాలను వండకూడదు. అలా వండడం వల్ల పోషక పదార్థాలు ఉండవని తెలుస్తోంది.

How To Use Pressure Cooker: An Ultimate Guide To Cook Quick Meals - NDTV Food

అయితే మరి ప్రెషర్ కుక్కర్ లో వండకూడని ఆహార పదార్థాలు ఏమిటి అనేది ఇప్పుడు పని పూర్తి చూద్దాం. కొన్ని ఆహార పదార్థాలను ప్రెషర్ కుక్కర్ లో వేసి వండడం వల్ల అవి విషపూరితంగా మారిపోతాయి. ఇది నెగిటివ్ ఎఫెక్ట్ మనపై చూపిస్తుంది. ఒకేసారి అది కనిపించకపోయినా క్రమంగా కనబడుతూ ఉంటుంది.

అన్నం:

ప్రెషర్ కుక్కర్ లో అన్నం వండడం వల్ల హానికరమైన రసాయన ఏర్పడుతుంది ఎఫెక్ట్ వెంటనే చూపకపోయినా నెమ్మదిగా చూపిస్తుంది. ప్రెషర్ కుక్కర్ లో అన్నం వండడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం కూడా ఉంది అని ఆరోగ్య నిపుణులు చెప్పారు.

బంగాళదుంపలు:

చాలామంది బంగాళదుంప కర్రీ వంటివి చేసుకునేటప్పుడు వెంటనే ప్రెషర్ కుక్కర్ లో వేసి ఉడికించేస్తూ ఉంటారు. అది అలా చేయడం తప్పు. బంగాళదుంప లో ఎక్కువగా పిండి పదార్ధాలు ఉంటాయి ఇలా అధికంగా పిండిపదార్ధాలు ఉండే వాటిని కుక్కర్ లో వేసి అస్సలు వండకూడదు. దీని వలన క్యాన్సర్, న్యూరోలాజికల్ డిసార్డర్ లాంటి సమస్యలు వస్తాయి.

చిలకడ దుంప:

దీనిలో కూడా పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిని కూడా కుక్కర్ లో వండకూడదు. నెలలో ఒకసారి వండుకుంటే పెద్ద ప్రమాదం ఏమీ రాదు కానీ రెగ్యులర్ గా చేస్తే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది

Read more RELATED
Recommended to you

Latest news