వానా కాలంలో సులువుగా అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకనే అటువంటి సమస్యల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. చాలా మంది వానా కాలంలో వివిధ రకాల జబ్బులు బారిన పడతారు. దీంతో ఇబ్బందులు వస్తాయి.
అలా కాకుండా అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అయితే మరి రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి..? సమస్యల బారిన పడకుండా ఎలా మనల్ని సురక్షితంగా ఉంచుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు వాన కాలంలో ఈ టీ ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లలు పెద్దలు కూడా ఈ టీ ని తీసుకోవచ్చు. డయాబెటిస్ సమస్యతో బాధపడే వాళ్ళు కూడా ఈ టీ ని తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది కలగదు.
వానా కాలం లో జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే ఈ టీ ని తీసుకోండి :
ఈజీగా ఈ టీ ని ఇలా తయారు చేసుకోండి:
ముందు ఓ గిన్నె లో కొంచెం నీళ్లు పోసి కడిగిన వేపాకులను, అల్లం వేసి స్టవ్ మీద పెట్టండి.
ఈ మిశ్రమాన్ని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించి తర్వాత స్టవ్ ఆపేసి మిశ్రమాన్ని వడకట్టేయండి.
తర్వాత నిమ్మరసం కొద్దిగా తేనె వేసుకుని వేడివేడిగా తీసుకోండి.
ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మరసం వేప అల్లం వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది అలానే జబ్బుల బారిన పడకుండా ఉండొచ్చు.