సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కొబ్బరి నూనె వాడతారు. కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. చర్మసంరక్షణ మొదలు దీని వలన ఎన్నో ప్రయోజనాలు మనం పొందొచ్చు. అయితే ఆయుర్వేదం ప్రకారం కొబ్బరి నూనె వల్ల కాన్స్టిపేషన్ సమస్య కూడా తగ్గుతుందట.
అయితే కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల కాన్స్టిపేషన్ సమస్య ఎలా తగ్గుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి నూనె లో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటి వల్ల అజీర్తి సమస్యలు తగ్గుతాయి.
కొబ్బరి నూనె వల్ల ఇంటస్టైన్స్ కి స్మూథ్ మూమెంట్ కలుగుతుంది. దీని వల్ల కాన్స్టిపేషన్ సమస్య రాకుండా చూసుకుంటుంది. అదే విధంగా కొబ్బరి నూనె మెటబాలిజంని కూడా పెంచుతుంది దీంతో ఒంట్లో ఉండే చెడు మలినాలు బయటకు వచ్చేస్తాయి.
అయితే ఈ నూనె ని కొబ్బరి పాల నుంచి తయారు చేసుకోవాలి. కాన్స్టిపేషన్ సమస్య ఉన్న వాళ్ళు రోజూ ఒకటి లేదా రెండు టీ స్పూన్స్ కొబ్బరి నూనె తాగితే మంచిది. తద్వారా కాన్స్టిపేషన్ సమస్య పూర్తిగా తగ్గుతుంది.