ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. అలానే కిడ్నీ సమస్యలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. డయాబెటిస్ వుంది కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు ఇలా అనుసరిస్తే ఆరోగ్యం బాగుంటుంది. లేదంటే లేనిపోని ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే డయాబెటిస్ వుంది కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
బ్లడ్ షుగర్ కంట్రోల్:
బ్లడ్ గ్లూకోస్ ని కంట్రోల్ చేసుకోవడం వలన కిడ్నీ సమస్యల ప్రమాదం తగ్గుతుంది. బ్లడ్ గ్లూకోస్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకుంటే కిడ్నీ సమస్యలు తగ్గుతాయని గుర్తుంచుకోవాలి రెగ్యులర్ గా వ్యాయామం చేయడం మందులు వేసుకోవడం చాలా ముఖ్యం ఇలా చేయడం వలన ఆరోగ్యం బాగుంటుంది ఈ సమస్యలు తగ్గుతాయి.
బ్లడ్ ప్రెషర్ కంట్రోల్:
డయాబెటిస్ తో బాధపడే వారికి బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది అయితే ఇలా బీపీ ఉండడం వలన కిడ్నీ సమస్యలు మరింత ఎక్కువవుతాయి కాబట్టి బీపీని కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి.
పొగాకు కి దూరంగా ఉండాలి:
పొగాకు తీసుకోవడం వలన కిడ్నీ సమస్యలు మరింత ఎక్కువవుతాయి కాబట్టి పొగాకు కి దూరంగా ఉండండి.
జీవన విధానంలో మార్పులు:
రెగ్యులర్ గా వ్యాయామం చేయడం సాల్ట్ ని తగ్గించడం వంటివి తప్పకుండా చేయండి. కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు ప్రోటీన్ చాలా తక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలానే జంక్ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
మందులు:
డాక్టర్ సలహా తీసుకుని రెగ్యులర్గా మందుల్ని వేసుకుంటూ ఉండాలి దీని వలన కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండొచ్చు ప్రమాదం కూడా తగ్గుతుంది.