బియ్యం నీటితో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా.!

మనం వంటగదిలో పనికిరానివి పడేసేవాటివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. తినిపడేసిన అరిటితొక్క, బత్తాయి తోలు, బియ్యంకడిగిన నీళ్లు. ఇలా చెప్పుకొట్టుపోతే బోలెడు. మన పెద్దలు అన్నం గంజిలో కాస్త ఉప్పు, మజ్జిగవేసుకుని తాగేవాళ్లు..కాని మనం ఇప్పుడు రైస్ కుక్కర్లలోనే వంటేచేస్తున్నాం..ఇగ గంజి ఎక్కడునుంచి వస్తుందిలే. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన ఆహార పదార్థాల్లో బియ్యం ఒకటి. రక్తంలో చక్కెర, గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ , ఇతర ప్రయోజనాలకు ఇది చాలా ముఖ్యం. అదేవిధంగా బియ్యం కడిగిన నీటివల్ల కలిగే ఉపయోగాలేంటో ఇటీవల జరిగిన కొన్ని అధ్యయానాల్లో తేలాయి.

rice water

బియ్యం నీటిలో ఖనిజాలు ఉంటాయి. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యం చేయడానికి సహాయపడుతుందట. బియ్యం నానబెట్టిన నీటిని ఆ తర్వాత ఏం చేస్తాం అని పారబోస్తారు. ఎందుకంటే ఈ నీరు మంచిది కాదని అపోహ. కానీ, ఇది పోషకాల మిశ్రమం. చర్మం, జుట్టు సంరక్షణలో ముందు వరుసలో నిలుస్తుంది. ఇది పేగు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట.

బియ్యం నీటి ప్రయోజనాలు

మెరిసే, ఆరోగ్యకరమైన జుట్టు..

క్లీవ్‌ల్యాండ్‌ క్లీనిక్‌ ప్రకారం బియ్యం నీరు ఇనోసిటాల్‌కు చెందిన గొప్ప మూలం. ఇది జుట్టు అందాన్ని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్‌తోపాటు జింక్, మెగ్నీషియం, విటమిన్‌ బీ,ఇ పోషకాలు ఉంటాయి. ఇది జుట్టు కుదుళ్లకు కూడా చాలా ప్రయోజనాలు కలిగిస్తుందట.

జీర్ణక్రియ..

బియ్యం నీటిలో ఫైబర్‌ కంటెంట్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన పేగు కదలికను ప్రోత్సహిస్తుంది. జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.

శక్తిపెంపు..

దీర్ఘకాలిక అలసట ఉన్నవారికి ఉడుకుతున్న రైస్‌ నుంచి ఒక గ్లాస్‌ రైస్‌ వాటర్‌ తీసుకుంటే మీకు శక్తినివ్వడానికి సహాయపడుతుంది. పనిలో లేదా పాఠశాలలో స్నేహితులతో మరింత చురుగ్గా ఉండాల్సిన సమయంలో ఈ నీరు తాగితే.. ఆరోగ్యకరమైన, కెఫిన్‌ లేని శక్తినిస్తుంది.

వృద్ధాప్యాన్ని నిరోధించే గుణం..

బియ్యం నీటిలో అమైనో యాసిడ్స్, న్యూట్రియేంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. ఇది చర్మాన్ని పొడిగా చేసి యాంటీ ఏజింగ్‌ పదార్థాలు కూడా కలిగి ఉంది. బియ్యం నీరు చర్మకాంతిని కాపాడుతుంది.

హైడ్రేషన్‌..

బియ్యం నీటిలో ఖనిజాలు ఉంటాయి. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. వాతావరణ పరిస్థితుల్లో ప్రయోజనకరమైన, అవసరమైన పోషకాలను కోల్పోకుండా హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు అతిసారంతో బాధపడుతున్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందట. ఎందుకంటే వారి శరీరంలో నీరు తక్కువగా ఉంటుంది. ఇది సమతుల్యం చేసి, అలసటను తగ్గిచ్చేస్తుంది.

ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండోయే బియ్యనీళ్లలో. ఇకనుంచి అయినా బియ్యం నీటిని ఉపయోగించటానికి ట్రై చేయండి. పై వాటిల్లో ఏ సమస్యలేకున్నా ఈరోజుల్లో జుట్టురాలటం అయితే అందరికి కామన్ గా ఉండే ప్రాబ్లమ్..ఎన్నో వాడుతుంటాం..ఓసారి ఇది కూడా ట్రై చేయండి.

– Triveni Buskarowthu