బ్యూటీటిప్స్ లో విటమిన్ ఇ ఆయిల్ ఒకటి. ఆడవారికి ఉండే కామన్ ప్రాబ్లమ్స్ కి ఇది సొల్యూషన్ అని చెప్పవచ్చు. చర్మం మీద ఉండే రకరకాల సమస్యలకు విటమిన్ ఇ ఆయిల్ చక్కటి పరిష్కారం. ఇప్పటికే చాలామంది విటమిన్ ఇ కాప్సిల్ ని వాడుతుంటారు. అసలు ఈ విటమిన్ ఇ ఆయిల్ తో ఎంత ఉపయోగం ఉందో, ఏ ఏ సమస్యలకు వాడొచ్చో ఇప్పుడు చూద్దాం.
మృతకణాలు తొలగించేందుకు..
కాఫీపౌడర్, విటమిన్ ఇ ఆయిల్ , చక్కెరను మిక్స్ చేసి ముఖంపై సర్క్యూలర్ మోషన్‌లో రుద్దాలి. దీంతో చర్మంపై పేరుకున్న మృతకణాలు తొలగిపోయి, మీ ముఖం కాంతివంతంగా మెరుపు సంతరించుకుంటుంది
డార్క్ స్పాట్స్..
డార్క్ స్పాట్స్ సమస్య చాలామందిలో ఉండే కామన్ ఇష్యూ. వీటికోసం చాలా ట్రై చేసి ఉంటాం.. ఓ సారి ఇది కూడా చూడండి.. విటమిన్ ఇ క్యాప్సూల్‌లో పసుపు వేసి బ్లాక్ హెడ్స్‌పై అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నల్ల మచ్చలు త్వరగా మాయమవుతాయి.
జుట్టు సంరక్షణ..
కొబ్బరి నూనెలో విటమిన్ ఇ ఆయిల్ ను కలిపి తలకు రాసుకుంటే జుట్టుకు ఎటువంటి సమస్యలు రావట. మీరు ఏ కొబ్బిరి నూనె వాడినా అందులో ఇది వేసి చూడండి.
ముడతలు మాయం..
రాత్రి పడుకునే ముందు విటమిన్ ఇ క్యాప్సూల్‌ను ముఖంపై రుద్ది 15 నిమిషాలు మసాజ్ చేయాలి. మరుసటి రోజు ఉదయమే ముఖం కడుక్కుంటే..ముడతలు పడిన చర్మం బిగుతుగా మారి యవ్వన రూపం సంతరించుకుంటుంది.
డార్క్ సర్కిల్స్..
సిస్టమ్స్ ముందు ఎక్కువసేపు కూర్చోటం, రాత్రుళ్లు ఫోను లేదా లాప్ టాప్స్ వాడటం, నిద్రసరిగ్గా పోకపోవటం వల్ల కల్లకింద నల్లటి మచ్చలు ఏర్పడతాయి. దీనివల్ల మీ ముఖం అందం మొత్తం దెబ్బతింటుంది. మీకు ఈ డార్క్ సర్కిల్స్ సమస్య ఉంటే.. కళ్ల చుట్టూ రాత్రి పడుకునేముందు ఈ ఆయిల్‌తో మసాజ్ చేసుకోవాలి. వరుసగా 3 రోజులు చేస్తే డార్క్ సర్కిల్స్ మాయమవుతాయి.
కనుబొమ్మలు..
చాలామందికి..కనుబొమ్మలు పలుచగా ఉటాయి. దీనికి పరిష్కారంగా ఐబ్రో పెన్సిల్ ని వాడుతుంటారు. అలాంటి వాళ్లు..రాత్రి పడుకునే ముందు విటమిన్ ఇ ఆయిల్‌ను కనుబొమ్మలపై రాసి మసాజ్ చేయాలి. తర్వాత రోజు ఉదయం మామూలు నీటితో కడుక్కుంటే మీ కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి. దీన్ని క్రమం తప్పకుండా చేయాల్సి ఉంటుంది.
డ్రైనెస్..
ఈ చలికాలంలో చేతులు, కాళ్లు పొడిబారడం సహజం. దానికోసం మనం బాడీలోషన్స్ వాడుతుంటాం.. విటమిన్ ఇ ఆయిల్‌ను మాయిశ్చరైజర్‌గా రాసుకోవాలి. చర్మం మృదువుగా మారుతుంది. నూనె అంటుకోదు.
చూశారుకదా..విటిమిన్ ఇ ఆయిల్ లో తో ఎన్ని లాభాలు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం..మీకు పైన పేర్కొన్న వాటిల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా షూరూచేసేయండి..!