చలిగా ఉందని రాత్రి స్వెటర్లు వేసుకుని నిద్రపోతున్నారా..?

-

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది..కొన్ని ప్రాంతాల్లో టెంపరేచర్‌ లెవల్స్‌ సింగిల్‌ డిజిట్‌కు పడిపోయాయి. చలికి తట్టుకోలేక స్వెటర్లు వేసుకోవడం కామన్‌..కానీ నిద్రపోయేప్పుడు కూడా స్వెటర్లు ధరిేంచే పడుకుంటారు.. కానీ ఇలా స్వెటర్లు వేసుకోని పడుకోవడం వల్ల.. అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. రాత్రి పూట స్వెటర్ వేసుకుని ఎందుకు నిద్రించకూడదో చూద్దాం..!
రాత్రిపూట స్వెటర్ ధరించి నిద్రపోవడం వల్ల పగటిపూట శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు… స్వెటర్‌ బదులు.. మందపాటి దుప్పటి లేదా మెత్తని బొంత కప్పుకొని పడుకోవడం మంచిది. వెచ్చని దుస్తులు ధరించి నిద్రించాలనుకుంటే ముందుగా చర్మం సున్నితమైన భాగాలపై మాయిశ్చరైజర్ క్రీమ్‌ను రాసుకోవాలి. తర్వాత తేలికపాటి వెచ్చని దుస్తులు ధరించవచ్చు.
రాత్రిపూట స్వెటర్‌ ధరించటం వల్ల.. రక్తపోటు పెరుగుతుంది వైద్య నిపుణులు అంటున్నారు.. నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రిపూట స్వెటర్లు లేదా వెచ్చని దుస్తులు ధరించి నిద్రించడం వల్ల రక్తపోటు చాలా రెట్లు పెరుగుతుంది. చాలా సమయం ఇదే స్థితిలో ఉంటే శ్వాస, చెమట సమస్య మొదలవుతుంది. కాబట్టి రాత్రిపూట సాధారణ దుస్తులు ధరించి నిద్రించడానికి ప్రయత్నించాలి.
ఫిట్‌గా ఉండాలంటే శరీరానికి క్రమం తప్పకుండా గాలి అవసరం. రాత్రిపూట వెచ్చని దుస్తులు ధరించడం వల్ల శరీరానికి సరైన గాలి అందదు. దీని కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ పరిస్థితిలో గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి..
రాత్రిపూట స్వెటర్లు, ఇతర వెచ్చని దుస్తులు ధరించడం వల్ల అనేక రకాల చర్మ సమస్యలు వస్తాయి. దీని వల్ల దురద, తామర లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.. దీంతో పాటు చర్మంపై ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
స్వెటర్లు మాత్రమే కాదు.. సాక్సులు కూడా వేసుకోని నిద్రపోకూడదు.. సాధారణంగా నిద్రపోతున్నప్పుడు బాడీ ఎక్కువ వేడిగా అవుతుంది. మీరు చలి ఎక్కువగా ఉందని స్వెటర్లు, సాక్సులు వేసుకోవడం వల్ల.. బాడీ వేడిగా అవుతుంది. చెమటలు పట్టి బాడీ డీహైడ్రేట్‌ అవుతుంది. నిద్రలో పదే పదే మేలుకూవస్తే.. అది గుండెకు కూడా మంచిది కాదు.. కాబట్టి తేలికపాటి దుస్తులు ధరించి మందపాటి దుప్పట్లు వేసుకోవడానికి ట్రై చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news