లివర్ సమస్యలేమో అని అనుమానమా..? అయితే ఇలా చెయ్యండి..!

-

ఈ మధ్యకాలంలో చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యలలో లివర్ సమస్య కూడా ఒకటి. అయితే లివర్ సమస్యలను ఎలా గుర్తించాలి..? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలని ఇప్పుడు చూద్దాం. చాలామంది నిత్యం అలసటకి గురవుతూ ఉంటారు. ఏ చిన్న పని చేసిన సరే త్వరగా అలసిపోతూ ఉంటారు.

మీరు కూడా ఇలానే అలసిపోతున్నట్టు అయితే కచ్చితంగా లివర్ ఆరోగ్యం ఎలా ఉంది అనేది చూసుకోండి. అలానే చాలామంది లివర్ సమస్యలు ఉన్నాయేమో అని అనుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళు ఈ లక్షణాలు ద్వారా లివర్ సమస్య ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు.

లివర్ సమస్యలను ఎదుర్కొంటున్న వాళ్లలో ఈ లక్షణాలు కనబడతాయి:

నోటి దుర్వాసన:

లివర్ సమస్య ఉంటే నోటి దుర్వాసనని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలానే సడన్ గా బరువు పెరిగిపోతారు. ఇలా జరిగితే ఖచ్చితంగా లివర్ సమస్యలు ఉన్నట్టు.

కొవ్వు:

పొట్టకి రెండు వైపులా కొవ్వు కనుక పెరిగిపోయినట్లయితే కచ్చితంగా లివర్ సమస్య అని తెలుసుకోండి డాక్టర్ ని కన్సల్ట్ చేయడం మంచిది.

తలనొప్పి:

ఎక్కువగా తలనొప్పి వస్తుంటే కూడా అది లివర్ సమస్య కావచ్చు. లివర్ లో టాక్సిన్లు ఉండకపోవడం వలన తలనొప్పి వస్తుంది.

జీర్ణ క్రియ:

లివర్ సరిగ్గా పనిచేయకపోతే జీర్ణక్రియ కూడా సరిగా పనిచేయదు శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలు కూడా అందవు.

నాలుక పొడిగా ఉండడం:

లివర్ సమస్యలు ఉంటే నాలుక పొడిగా మారిపోతుంది.

వికారం:

వికారంగా ఉంటే కూడా లివర్ సమస్య కావచ్చు ఒకవేళ కనుక మీలో ఈ లక్షణాలు ఉంటే డాక్టర్ని కన్సల్ చేయండి.

 

Read more RELATED
Recommended to you

Latest news