పాలు కల్తీ అయ్యాయేమో అని అనుమానమా..? ఇలా టెస్ట్ చెయ్యండి..!

-

మనం తాగే పాలు కల్తీ అయ్యాయేమో అని సందేహం మనలో కలుగుతూ ఉంటుంది. అయితే మనం తీసుకునే పాలు కల్తీ అయ్యాయా..? లేదంటే బాగున్నాయా అని ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఒక్కొక్కసారి పాలను కల్తీ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం సులభంగా ఇంట్లోనే చెక్ చేయవచ్చు.

పాలల్లో కనుక ఏదైనా సింథటిక్ ఉన్నట్లయితే పాల వాసనను చూస్తే ఈజీగా గుర్తించొచ్చు. సింథటిక్ కనుక పాలల్లో కలిగి ఉన్నట్లయితే చెడు రుచి, వాసన దాని నుండి వస్తాయి.
అలానే ఒక్కొక్కసారి కల్తీ పాలు సబ్బు వాసన లాగ వస్తాయి. అలా వచ్చినా సరే మనం గుర్తించవచ్చు. సబ్బు వాసన కనుక వచ్చినట్లు అనుమానం ఉంటే చేతి మీద కొంచెం పాలు వేసి రుద్దండి. ఆ తర్వాత వాసన చూస్తే తెలిసిపోతుంది.

సాధారణంగా పాలు ప్రవహిస్తాయి. ఒకవేళ ఇంకా మీకు అనుమానం ఉంటే కొద్దిగా పాలను ఏదైనా సర్ఫేస్ మీద వేయండి. పాలు కనుక పాలు వెళ్ళేదారిలో తెల్లగా కనబడుతోంది అంటే నిజమైనవే. అలా కాకుండా ఏమీ కనపడకపోయినా వేగంగా పాలు వెళ్లిపోతున్నా వి కల్తీ పాలు అని మనం గుర్తించవచ్చు.
ఒకవేళ కనుక పాలల్లో యూరియాను వేశారంటే దానిని గుర్తించడం కష్టం. పాలల్లో యూరియాని గుర్తించలేము కనుక లిట్మస్ పేపర్ ని ఉపయోగించాలి. ఇలా ఈ పద్ధతుల ద్వారా మనం కల్తీ పాలను గుర్తించచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news