బరువు తగ్గించడంలో క్యాప్సికమ్ పనిచేస్తుందా.? ఎరుపు రంగు క్యాప్సికమ్‌ తినేస్తున్నారా..?

కొవ్వు కరిగించడానికి చేయని ప్రయత్నం లేదు.. కానీ లాభం మాత్రం రావడం లేదా..? పెరిగే బరువు తగ్గించాలంటే.. ఎదిగే కొవ్వు కరిగించాలి..ఇది వ్యాయామం లేదా తినే ఆహారం ద్వారానే ఫ్యాట్‌ బర్న్‌ చేయొచ్చు. కొవ్వు వెన్నలా కరిగించటంలో క్యాప్సికమ్‌ చాలా బాగా పనిచేస్తుందని మీకు తెలుసా..?మార్కెట్‌లో ఇది వివిధ రంగుల్లో లభిస్తుంది. పోషకాల విలువలు మెండుగా ఉండే క్యాప్సికమ్‌తో కూడా బరువు తగ్గించుకోవచ్చు. అయితే రెడ్ క్యాప్సికమ్, పసుపు క్యాప్సికం, ఆకుపచ్చ, ఆరెంజ్ , ఊదా, నలుపు క్యాప్సికమ్ అని వివిధ రంగుల్లో ఉన్నాయి. కలర్‌ వల్ల క్యాప్సికమ్‌ క్వాలిటీస్‌ మారిపోతాయా? ఏ కలర్‌ క్యాప్సికమ్‌ మంచిది..?

రెడ్‌ క్యాప్సికమ్‌ ది బెస్ట్‌..

యాంటీఆక్సిడెంట్ల ప్రొఫైల్‌కు విభిన్న వర్ణద్రవ్యాలు కారణమేనని నిపుణులు చెబుతున్నారు. రెడ్ క్యాప్సికమ్‌లు, ఇతర క్యాప్సికమ్‌ల కంటే ఎక్కువ ఫైటోన్యూట్రియెంట్‌లను కలిగి ఉంటాయి, ఇవి అత్యధిక యాంటీఆక్సిడెంట్లతో ఉంటాయట. ఆకుపచ్చ రకాల కంటే 11 రెట్లు ఎక్కువ బీటా కెరోటిన్ ఒకటిన్నర రెట్లు ఎక్కువ విటమిన్ సి కలిగి ఉంటుంది. ఆకుపచ్చ, పసుపు క్యాప్సికమ్‌లో కన్నా ఎరుపు క్యాప్సికమ్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, వాపు తగ్గించే గుణాలు ఎక్కువ.ఇవి ప్రొస్టేట్, గర్భాశయ, బ్లాడర్, క్లోమ గ్రంథి క్యాన్సర్‌ను నివారిస్తాయి. క్యాప్సికమ్‌లోని ఫినోలిక్స్, ప్లేవోనాయిడ్స్ శరీరంలో ఎలర్జీని తగ్గిస్తాయి. ఎరుపు రంగు క్యాప్సికమ్‌లో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఆకుపచ్చ మంచిదేనా..

ఆకుపచ్చ క్యాప్సికమ్ ఎరుపు, పసుపు లేదా నారింజ రకాల కంటే తక్కువ చక్కెరను ఇది కలిగి ఉంటుంది. కొన్నిసార్లు ఆకుపచ్చ క్యాపిస్కమ్‌లతో జీర్ణ సమస్యలను వచ్చే అవకాశం ఉంది.. ఎందుకంటే ఈ రకంలో ఎక్కువ షార్ట్ చైన్ కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి. ఇవి చిన్న ప్రేగులలో సరిగా గ్రహించబడవు. ఆకుపచ్చ క్యాప్సికమ్‌లో కొవ్వును తగ్గించే ఫైబర్ ఉంటుంది. వీటిలోని విటమిన్ బి6, ఫోలిక్ ఆమ్లాలు గుండె సంబంధ వ్యాధులకు కారణమయ్యే హోమోసిస్టిన్ అమినో ఆమ్లం ఉత్పత్తిని నియంత్రిస్తుంది. క్యాప్సికమ్‌లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి అత్యవసరం. క్యాప్సికమ్‌లోని ల్యూటిన్ అనే కెరోటెనాయిడ్ కంటిచూపు మందగించకుండా చూస్తుంది.

క్యాప్సికమ్‌లో నియాసిన్, రిబోఫ్లావిన్, థయామిన్ మరియు పాంతోతేనిక్ యాసిడ్‌లు కూడా ఉన్నాయి. ఇందులో ఉండే సీ విటమిన్‌ రక్త నాళాలు, చర్మం, ఎముకల దృఢత్వానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిలో తోడ్పడుతుంది.క్యాప్సికమ్‌లో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. ఫైబర్ వాటర్ కంటెంట్ కూడా తక్కువ మోతాదులో ఉంటుంది. క్యాప్సికమ్‌లో తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు, కేలరీలు ఉంటాయి. ఇవి బరువు తగ్గించేందుకు ఉపయోగడతాయి.

జుట్టుకు కూడా…

క్యాప్సికమ్ జుట్టును బలంగా చేస్తుంది. తలకు రక్తప్రసరణ పెరిగి వెంట్రుకలు పెరగడంలో ఇందులో ఉండే పోషకాలు మేలు చేస్తాయి. క్యాప్సికమ్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణను నిరోధించడం ద్వారా కణాలను మరింత దెబ్బతినకుండా రక్షించడానికి సహాయపడతాయి. సో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి..వారానికి ఒకసారి అయినా క్యాప్సికమ్‌ను డైట్‌లో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది.!

-Triveni Buskarowthu