గోళ్లతో ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఇన్ని లాభాలా..!!

చాలామందికి వ్యాయామాలు చేసే అలవాటే ఉండదు.. ఇక యోగాలు ఏం చేస్తారు. కానీ యోగా చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వల్ల అటు అందం ఇటు ఆరోగ్యం రెండూ కాపాడుకోవచ్చు. యోగాలలో ఒకటి గోళ్లను రుద్దడం. ఈ యోగా సాధన వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గోళ్లను ఒక చేతిది మరోచెతి గోర్లతో రుద్దడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుందని మీకు తెలుసా..? ఇంకా ఏం ఏం ఉన్నాయో చూద్దామా..!

జుట్టు రాలడం తగ్గుతుంది..

ఈరోజుల్లో జుట్టు రాలే సమస్య లేని వారంటే వందలో ఒక్కరిద్దరు ఉంటారేమో.. అందరూ ఈ సమస్యతో బాధపడున్నవారే..సమస్య ఒకటే కానీ, కారణాలు వేరు, పరిష్కారాలు బోలెడు. గోళ్లను క్రమం తప్పకుండా రుద్దడం వల్ల శరీరంలో డైహైడ్రోటెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిని నియంత్రించవచ్చు. ఇది మంచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే, నిర్జీవమైన జుట్టు పోతుంది.. అంతే కాదు రెగ్యులర్‌గా గోళ్లను రుద్దడం వల్ల తెల్లజుట్టు, బట్టతల, నిద్రలేమి వంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.

ఒత్తిడిని దూరం చేస్తుంది..

గోళ్లను కలిపి రుద్దడం వల్ల రిఫ్లెక్సాలజీ రిఫ్లెక్స్ ప్రాంతంపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడితో, మీరు శరీరంలో నొప్పి, ఒత్తిడిని తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.. అదనంగా.. ఇది మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుందట..

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది..

గోళ్లను రుద్దడం వల్ల మన శరీరంలోని అనేక అవయవాలకు మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే, ఇది రక్త ప్రసరణను ప్రోత్సహించడంలో మీకు సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ఈ యోగా చేయడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. గుండె సంబంధిత సమస్యలు అంటే ఈరోజుల్లో అధికంగా వస్తున్నాయి. మంచి జీవనశైలితో పాటు అప్పుడప్పుడు ఇలాంటి పనులు కూడా చేస్తుండాలి.

ఇతర యోగాసనాలు, వ్యాయామాలు అంటే పర్టిక్యులర్‌గా ఈ టైంలోనే ఈ ప్రదేశంలోనే చేయాలి. కానీ ఇది అలాకాదు..మీకు ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా చేయొచ్చు..మీరు చూసే ఉంటారు పరుగు సినిమాలో హీరోయిన్‌ అదేపనిగా ఇలా గోర్లు రుద్దుకుంటూ ఉంటుంది. ఒక వ్యాపకం అలా ఇది చేసకుంటే..మంచి ప్రయోజనాలు పొందొచ్చు. ఏమంటారు..!